AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cult Movie: దయచేసి వారు నా సినిమాను చూడొద్దు.. ‘కల్ట్’ రిలీజ్‌కు ముందుకు విశ్వక్ సేన్ సంచలన ప్రకటన

' మా సినిమా బాగుంది, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడండి'.. ఇది సినిమా రిలీజ్ లకు ముందు హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు చెప్పే మాటలు. కానీ కల్ట్ హీరో అండ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ మాత్రం డిఫరెంట్ గా 'దయచేసి వారు మా సినిమాను చూడొద్దు' అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు.

Cult Movie: దయచేసి వారు నా సినిమాను చూడొద్దు.. 'కల్ట్' రిలీజ్‌కు ముందుకు విశ్వక్ సేన్ సంచలన ప్రకటన
Vishwak Sen Cult Movie
Basha Shek
|

Updated on: Oct 29, 2026 | 6:43 PM

Share

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా #కల్ట్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 30) న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు గాయత్రి భరద్వాజ్, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్ట్ సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశారు కానీ.. ఆంధ్రప్రదేశ్ లో అర్బన్ తుపాను నేపథ్యంలో ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇందుకు బదులుగా గురువారం కల్ట్ ప్రీరిలీజ్ ప్రెస్‌ మీట్‌నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వక్ సేన్ తన కల్ట్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నిన్న రాత్రే నేను ఫైనల్ కాపీ చూసుకున్నా. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో, కేవలం నాలుగు రూపాయలు వెనకేసుకుందామని తీసిన సినిమా మాత్రం కాదు. కుదిరినన్ని ఎక్స్‌పెరిమెంట్లు అన్నీ ఒకే కథలో పెట్టి ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి చేసిన ప్రయత్నం. స్క్రీన్‌పై జరిగేది చూసి తట్టుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. అందుకే వీక్ హార్టెడ్ పీపుల్, చిన్న పిల్లలు నా సినిమాకు దూరంగా ఉండడమే మంచిది. సినిమా ప్రారంభం నుంచి ఒక ఎత్తయితే, సెకండ్ హాఫ్‌లోని చివరి అరగంట నుంచి 45 నిమిషాల భాగం ఆడియన్స్‌కు ఒక ఓవర్‌వెల్మింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

‘నా కెరీర్ లోనే అత్యంత కష్టమైన, రిస్క్ తో కూడిన సినిమా ఇది. ఈ వైల్డ్ సినిమాను థియేటర్లలో పూర్తిస్థాయిలో అనుభవించాలంటే సౌండ్ చాలా ముఖ్యం. కాబట్టి థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు నాదొకటే రిక్వెస్ట్.. సౌండ్ వాల్యూమ్ 6.7 మెయింటైన్ చేయండి. ఒకవేళ థియేటర్‌లో శబ్దం తక్కువగా అనిపిస్తే ఆడియన్సే స్వయంగా వెళ్లి సౌండ్ పెంచమని అడగండి. దాదాపు 150 మంది నటీనటులతో 45 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా శ్రమించి ఈ సినిమాను తీశాం. మా సినిమాను ఆశీర్వదించండి’ అని విశ్వక్ సేన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా సందీప్‌ కాకరాల నిర్మించిన కల్ట్ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బ్రసూర్ సంగీతం అందించారు.

కల్ట్ రిలీజ్ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'కల్ట్' 'సినిమా రిలీజ్‌కు ముందుకు విశ్వక్ సేన్ సంచలన ప్రకటన
'కల్ట్' 'సినిమా రిలీజ్‌కు ముందుకు విశ్వక్ సేన్ సంచలన ప్రకటన
ఆ 550 ఎకరాలు ప్రభుత్వానివే.. మియాపూర్ భూములు కేసులో సుప్రీం..
ఆ 550 ఎకరాలు ప్రభుత్వానివే.. మియాపూర్ భూములు కేసులో సుప్రీం..
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
కొంపముంచిన చోలేభటూరే.. అదనపు చోలే అడిగినందుకు కత్తితో పొడిచి హత్య
కొంపముంచిన చోలేభటూరే.. అదనపు చోలే అడిగినందుకు కత్తితో పొడిచి హత్య
దీపావళి బోనస్ వచ్చిందా? ఈ 4 పథకాలలో పెట్టుబడి పెడితే మంచి రాబడి!
దీపావళి బోనస్ వచ్చిందా? ఈ 4 పథకాలలో పెట్టుబడి పెడితే మంచి రాబడి!
రక్త పిశాచిని పోలిన డ్రాక్యులా ఆర్కిడ్స్
రక్త పిశాచిని పోలిన డ్రాక్యులా ఆర్కిడ్స్
అభిషేక్, వైభవ్ కాదు.. 4వ టీ20లో ఇక అందరి చూపు అతనిపైనే..!
అభిషేక్, వైభవ్ కాదు.. 4వ టీ20లో ఇక అందరి చూపు అతనిపైనే..!
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన ఘటన.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.
శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన ఘటన.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.
ఇవాళే OTTలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్
ఇవాళే OTTలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్