Devara: ‘దేవర’ మ్యూజిక్ ఉందమ్మా.. నెక్ట్స్ లెవల్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‏ని ఖుషీ చేసిన విశ్వక్ సేన్..

ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ గురించి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు హీరో విశ్వక్ సేన్.

Devara: 'దేవర' మ్యూజిక్ ఉందమ్మా.. నెక్ట్స్ లెవల్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‏ని ఖుషీ చేసిన విశ్వక్ సేన్..
Ntr, Vishwak Sen
Follow us

|

Updated on: Apr 03, 2024 | 2:50 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ గురించి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు హీరో విశ్వక్ సేన్.

తారక్‏ను హగ్ చేసుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ దేవర మ్యూజిక్ అప్డేట్ ఇచ్చాడు విశ్వక్ సేన్. “ఎప్పటికీ లవ్ యూ ఎన్టీఆర్ అన్నా.. దేవర మ్యూజిక్ ఉందమ్మా నెక్ట్ లెవల్.. ఇక ఈ ఆల్బమ్ అందరినీ పాటలతో చంపేస్తుంది” అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తమిళం, తెలుగులో అనేక చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. గతేడాది రిలీజ్ అయిన జవాన్ సినిమాకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు విశ్వక్ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ దేవర మ్యూజిక్ ఎలా ఇచ్చి ఉంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ దగ్గరి నుంచి దళపతి విజయ్, షారుఖ్ ఖాన్ వరకు దాదాపు స్టార్ హీరోలందరికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అనిరుధ్. ఇక ఇప్పుడు దేవర సినిమాకు అద్భుతమైన పాటలు, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరు. విశ్వక్ చేసిన పోస్టుతో అటు దేవర మ్యూజిక్ పై మరింత హైప్ పెరిగింది. ఖచ్చితంగా తారక్, కొరటాల సినిమాకు బీజీ, మ్యూజిక్ వేరే లెవల్ ఉంటుందని అంటున్నారు. చాలా కాలం తర్వాత తారక్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర సినిమాతో రాబోతున్నారు.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ పెళ్లిపై విశాల్ కౌంటర్.. అంతమాట అన్నాడేంటి.?
ప్రభాస్‌ పెళ్లిపై విశాల్ కౌంటర్.. అంతమాట అన్నాడేంటి.?
IPL Fastest Fifty: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే..
IPL Fastest Fifty: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే..
ఏంటీ.. ఈ హీరోయిన్ దావూద్ ఇబ్రాహీంతో డాన్స్ చేసిందా..?
ఏంటీ.. ఈ హీరోయిన్ దావూద్ ఇబ్రాహీంతో డాన్స్ చేసిందా..?
మీ చిన్నారులు యూట్యూబ్‌ చూస్తున్నారా.? అలాంటి వీడియోలు రాకూడదంటే.
మీ చిన్నారులు యూట్యూబ్‌ చూస్తున్నారా.? అలాంటి వీడియోలు రాకూడదంటే.
నామినేషన్ గడువు ముగుస్తున్నా ఆ ఎంపీ అభ్యర్థిని ప్రకటించని పార్టీ
నామినేషన్ గడువు ముగుస్తున్నా ఆ ఎంపీ అభ్యర్థిని ప్రకటించని పార్టీ
బ్యాకప్ ప్లాన్‌తో మ్యాజిక్ చేస్తున్న నాని..
బ్యాకప్ ప్లాన్‌తో మ్యాజిక్ చేస్తున్న నాని..
టాలీవుడ్ కు మరో షాక్.. థియేటర్స్ అన్నీ ఖాళీ.. అసలు ఏమైందంటే ??
టాలీవుడ్ కు మరో షాక్.. థియేటర్స్ అన్నీ ఖాళీ.. అసలు ఏమైందంటే ??
మొన్న ఓటమిలో హీరో.. కట్‌చేస్తే.. నిన్న ఓటమితో విలన్‌‌గా తిట్లు..
మొన్న ఓటమిలో హీరో.. కట్‌చేస్తే.. నిన్న ఓటమితో విలన్‌‌గా తిట్లు..
శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్.. అభిమానులతో సెల్ఫీలు..
శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్.. అభిమానులతో సెల్ఫీలు..
సల్మాన్ ఇంటి పై ఎటాక్‌తో కింగ్ ఖాన్‌కు భద్రత పెంపు..
సల్మాన్ ఇంటి పై ఎటాక్‌తో కింగ్ ఖాన్‌కు భద్రత పెంపు..