- Telugu News Photo Gallery Cinema photos Actress Kriti Sanon Spoke About Qualities Of Her Future Husband
Kriti Sanon: కాబోయేవాడు ఎలా ఉండాలో హీరోయిన్ కృతి సనన్ చెప్పేసిందిగా..
కాబోయేవాడు ఎలా ఉండాలి? ఇదో నెవర్ ఎండింగ్ టాపిక్. అందులోనూ ఈ విషయాన్ని గురించి హీరోయిన్లు చెబుతుంటే వినడానికి చాలా సరదాగా ఉంటుంది. ఏం చెబుతారా? అని మరింత ఇంట్రస్టింగ్‌గా వినాలనిపిస్తుంది. అందుకే, ఇప్పుడు కృతిసనన్ చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లల్లో ఎవరూ చెప్పని యాంగిల్‌ని పట్టుకున్నారు మిస్ కృతి. నేషనల్ అవార్డు అందుకోవడానికి ముందు, అందుకున్న తర్వాత అన్నట్టుంది కృతిసనన్ తీరు.
Updated on: Apr 03, 2024 | 2:48 PM

కాబోయేవాడు ఎలా ఉండాలి? ఇదో నెవర్ ఎండింగ్ టాపిక్. అందులోనూ ఈ విషయాన్ని గురించి హీరోయిన్లు చెబుతుంటే వినడానికి చాలా సరదాగా ఉంటుంది. ఏం చెబుతారా? అని మరింత ఇంట్రస్టింగ్‌గా వినాలనిపిస్తుంది. అందుకే, ఇప్పుడు కృతిసనన్ చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లల్లో ఎవరూ చెప్పని యాంగిల్‌ని పట్టుకున్నారు మిస్ కృతి.

నేషనల్ అవార్డు అందుకోవడానికి ముందు, అందుకున్న తర్వాత అన్నట్టుంది కృతిసనన్ తీరు. జాతీయ పురస్కారం ఈ భామలో చాలా పెద్ద మార్పే తీసుకొచ్చింది. అంతకు ముందు ఏదైనా విషయాన్ని చెప్పడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు కృతి సనన్. కానీ ఇప్పుడలా లేరు. ఏ విషయాన్నైనా బాహాటంగా చెప్పేస్తున్నారు.

రీసెంట్‌గా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. అందులోనూ ఫారినర్స్ గురించి కృతి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఫారినర్స్ హాట్‌గా ఉండొచ్చేమోగానీ, తనకు వారి పట్ల ఎప్పుడూ అట్రాక్షన్ లేదని అన్నారు కృతి. అంతే కాదు, తనకు ఇంగ్లిష్లో మాట్లాడటం కంఫర్ట్ గా ఉండదని అన్నారు.

కృతిని చేసుకునే వ్యక్తికి ఉండాల్సిన ప్రధానమైన అర్హత హిందీ మాట్లాడటమేనట. అంతేకాదు, హిందీ, పంజాబీ పాటలకు డ్యాన్స్ చేయాలట. ఆ పాటలను కృతితో కలిసి ఆస్వాదించాలట. భారతీయుడితోనే డేటింగ్‌కి ఇష్టపడతానని అంటున్నారు సిల్వర్‌స్క్రీన్ జానకి. ఆదిపురుష్ సమయంలో ప్రభాస్‌తో కృతికి సమ్ థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలొచ్చాయి. అయితే, తమ మధ్య అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు డార్లింగ్.

ప్రస్తుతం కృతి తనకన్నా పదేళ్లు చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, తన ప్రేమాయణం గురించి ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పలేదు కృతి సనన్. పెళ్లి విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ఉందని చెప్పకనే చెప్పేశారు ఈ బ్యూటీ.




