AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaami OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘గామి’.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ మార్కెట్ ఏర్పర్చుకున్నాడు. ఇటీవల గామి సినిమాతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. విద్యాధర్ దర్శకత్వం వహించిన తెలుగు అడ్వెంచర్ థ్రిల్లర్ గామి టాలీవుడ్ ప్రేక్షకులను కట్టపడేసింది.

Gaami OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘గామి’.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే!
Gaami
Balu Jajala
|

Updated on: Apr 03, 2024 | 7:18 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ మార్కెట్ ఏర్పర్చుకున్నాడు. ఇటీవల ఈ హీరో గామి సినిమాతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. విద్యాధర్ దర్శకత్వం వహించిన తెలుగు అడ్వెంచర్ థ్రిల్లర్ గామి టాలీవుడ్ ప్రేక్షకులను కట్టపడేసింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు టేకింగ్, నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. రూ.2 కోట్ల చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని 2024 మార్చి 8న థియేటర్లలో విడుదల అయ్యింది. విశ్వక్ సేన్ కెరీర్ లో భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.

థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి గామి రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని రాబట్టి నిర్మాతలకు బ్లాక్ బస్టర్ మూవీని అందించింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ ప్రేక్షకులు ఈ మూవీకోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ప్రముఖ డిజిటల్ పోర్టల్ జీ5లో త్వరలోనే గామీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే జీ5లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 12 స్ట్రీమింగ్ కానుంది.

విద్యాధర్ దర్శకత్వం వహించిన గామి అడ్వైంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. హాలీవుడ్ స్థాయిలో ఈ మూవీని నిర్మించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. విశ్వక్ సేన్ తో పాటు అభినయ, హారిక పెద్ద, దయానంద్ రెడ్డి, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే గామీ ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్