Vishal: రాజకీయాల్లోకి మరో స్టార్‌ హీరో విశాల్‌.. పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్ రెడీ

ఎంజీఆర్, విజయ్ కాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవలే తమిళ నటుడు విజయ్ కూడా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇపుడు మరో నటుడు విజయ్ ని ఫాలో అవుతున్నారు. నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.

Vishal: రాజకీయాల్లోకి మరో స్టార్‌ హీరో విశాల్‌.. పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్ రెడీ
Actor Vishal

Edited By:

Updated on: Feb 06, 2024 | 1:18 PM

దేశంలో సినీపరిశ్రమ నుంచి వచ్చి రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన పరిస్థితి దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా చూస్తుంటాం. అందులోనూ తమిళనాడులో కాస్త ఎక్కువ ఈ వాతావరణం మనకు కనబడుతుంది. ఎంజీఆర్, విజయ్ కాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవలే తమిళ నటుడు విజయ్ కూడా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇపుడు మరో నటుడు విజయ్ ని ఫాలో అవుతున్నారు. నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. అందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాట వ్యక్తి పూజ ఎక్కువ.. ఒక వ్యక్తిని అభిమానిస్తే ఎంతలా అక్కున చేర్చుకుంటారు అనడానికి అక్కడ అనేక ఉదాహరణలు చూడొచ్చు. నటీనటులకు ఆలయాలు కట్టి మరీ పూజించడం దేశంలో తమిళనాడులో మాత్రమే చూడగలం. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన నటులకు కూడా ఆదరణ ఉంటుందని కొన్ని సందర్భాలు రుజువు చేశాయి.

విజయ్ దారిలోన విశాల్..

అప్పట్లో ఎంజిఆర్ పొలిటికల్ ఎంట్రీ సక్సెస్ అయ్యింది. ఆతర్వాత నేరుగా పార్టీ పెట్టకున్నా అన్నాడీఎంకే లో చేరి జయలలిత కూడా పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు. ఆతర్వాత నటుడు విజయ్ కాంత్ డీఎండీకే పార్టీని స్థాపించి 2011లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకున్నా బలమైన డీఎంకే పార్టీకి కూడా దక్కని ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించారు. ఆతర్వాత అనారోగ్య పరిస్థితుల కారణంగా పార్టీని నడిపించలేక పోయారు. తాజాగా తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ చేయనున్నారు. అధికారికంగా ప్రకటన కూడా చేసిన విజయ్ పార్టీ ఏర్పాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే తన టార్గెట్ ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు కాదని, 2026 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే రాజకీయాంగా…

ఇప్పుడు మరో సినీ నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. విశాల్ కు కూడా తమిళనాట మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే తమిళన చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వీటి కేంద్రంగా కొన్ని వివాదాలు తలెత్తినా ఓ వర్గం నుంచి ఆదరణ పొందారు. ఇక జయలలిత మరణం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. జయలలిత సిట్టింగ్ స్థానమైన ఆర్.కే నగర్ నుంచి నామిమేషన్ వేశారు. అయితే ఆ ఎన్నికల్లో విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. కావాలనే నామినేషన్ చెల్లుబాటు కాకుండా చేసారని చర్చ జరిగింది అప్పట్లో.. ఆ పరిణామాలు విశాల్ కు సింపతిని తెచ్చిపెట్టాయి. రాజకీయాలపై ఆసక్తిగా ఉండే విశాల్ ఇప్పుడు నేరుగా పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్..

విశాల్ కూడా విజయ్ తరహాలో ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాకుండా.2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని స్థాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకున్నా ఎదో ఒక పార్టీకి మద్దతు ప్రకటించి తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో విజయ్ కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకున్నా 2011 ఎన్నికల్లో జయలలిత కూటమికి మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో జయలలిత విజయం సాధించారు. ఇప్పుడు విశాల్ కూడా అదే పార్ములా అనుసరిస్తున్నారు అన్నది విశ్లేషకుల మాట. ఒక వేళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఫలితం అనుకూలంగా లేకపోతే అది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న ఆలోచనతోనే ఈ ఇద్దరు హీరోలు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.