Actor Suriya: బాబోయ్.. సూర్య కూతురు మల్టీటాలెంటెడ్.. హీరోయిన్ అనుకుంటే ఇలా షాకిచ్చిందేంటీ..
అయితే వీటన్నింటికి ఇటీవలే క్లారిటీ ఇచ్చింది జ్యోతిక. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను హిందీలో రెండు సినిమాలు చేస్తున్నాని.. అలాగే తన పిల్లల చదువు గురించి ముంబైకి మారినట్లు చెప్పుకొచ్చింది. త్వరలోనే మళ్లీ చెన్నైకి తిరిగి వెళ్తామని అన్నారు. ప్రస్తుతం సూర్య పిల్లలు దియా, దేవ్ ఇద్దరూ ముంబైలోని అత్యుత్తమ పాఠశాల్లో ఒకటైన అసెండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు.

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చారు. దీంతో సూర్య కుటుంబం విచ్ఛిన్నమైందని.. తన తల్లిదండ్రులతో మనస్పర్థల కారణంగానే సూర్య తన ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లిపోయారంటూ రూమర్స్ వినిపించాయి. అయితే వీటన్నింటికి ఇటీవలే క్లారిటీ ఇచ్చింది జ్యోతిక. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను హిందీలో రెండు సినిమాలు చేస్తున్నాని.. అలాగే తన పిల్లల చదువు గురించి ముంబైకి మారినట్లు చెప్పుకొచ్చింది. త్వరలోనే మళ్లీ చెన్నైకి తిరిగి వెళ్తామని అన్నారు. ప్రస్తుతం సూర్య పిల్లలు దియా, దేవ్ ఇద్దరూ ముంబైలోని అత్యుత్తమ పాఠశాల్లో ఒకటైన అసెండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు.
సూర్య కూతురు దియా ప్రస్తుతం 11వ తరగతి చదువుతుంది. చదువులో ఎప్పుడూ ముందుండే దియా.. ఇప్పుడు క్రీడల్లోనూ ముందున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తన పాఠశాలలో జరిగిన స్పోర్ట్స్ డేకు సంబంధించిన వీడియోను, తన కూతురు దియాతో కలిసి దిగిన ఫోటోను జ్యోతిక తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. ‘కెప్టెన్ దియా, దేవ్… మేము గర్వపడుతున్నాము’ అంటూ రాసుకొచ్చింది. దియా స్పోర్ట్స్ డేలో దియా, దేవ్ ఇద్దరూ అనేక బహుమతులు గెలుచుకున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సూర్య సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తోన్న కంగువ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నాడు సూర్య. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అటు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది జ్యోతిక.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.