Bigg Boss : బిగ్‏బాస్ హోస్ట్‏గా తప్పుకున్న స్టార్ హీరో.. ఇకపై హోస్టింగ్ చేయనున్న విజయ్ సేతుపతి..

|

Sep 04, 2024 | 10:03 PM

మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా తొలివారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళంలోనూ బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే మొదటి నుంచి అంటే 2017 నుంచి ఈ షోకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షో నుంచి తప్పుకున్నారు కమల్.

Bigg Boss : బిగ్‏బాస్ హోస్ట్‏గా తప్పుకున్న స్టార్ హీరో.. ఇకపై హోస్టింగ్ చేయనున్న విజయ్ సేతుపతి..
Vijay Sethupathi
Follow us on

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీకి షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని భాషలలోనూ చాలా సీజన్స్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 రన్ అవుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా తొలివారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళంలోనూ బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే మొదటి నుంచి అంటే 2017 నుంచి ఈ షోకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షో నుంచి తప్పుకున్నారు కమల్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండడంతోనే కమల్ ఈ షో నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

దీంతో కొత్త బిగ్ బాస్ షోకి ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారనే ప్రశ్న తలెత్తింది. కమల్ స్థానంలోకి కోలీవుడ్ హీరో శింబు వస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత హీరో విజయ్ సేతుపతి పేరు వినిపించింది. తాజాగా బిగ్‏బాస్ సీజన్ 8 హోస్టింగ్ పై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. తమిళం బిగ్‏బాస్ సీజన్ 8కు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్టింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో విజయ్ సేతుపతి మరింత స్టైలీష్ గా కనిపించారు. అలాగే బిగ్‏బాస్ షో లోగో కూడా అభిమానులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.

ఇవి కూడా చదవండి

గతంలో కరోనా లాక్ డౌన్ సమయంలో కమల్ ఇన్ఫెక్షన్ తో బాధపడ్డారు. దీంతో రెండు వారాల పాటు బిగ్‏బాస్ షో హోస్టింగ్ చేయలేకపోయారు. ఆ సమయంలో కమల్ స్థానంలోకి నటి రమ్యకృష్ణ వచ్చింది. దాదాపు రెండు వారాల పాటు బిగ్‏బాస్ షో హోస్ట్ గా వ్యవహరించారు. దీంతో ఈసారి కూడా రమ్యకృష్ణ వస్తుందనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 8కు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేయనున్నారు.

బిగ్‏బాస్ ప్రోమో.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.