Varun Tej: ‘గని’ కష్టాలు మాములుగా లేవుగా.. జిమ్‏లో వరుణ్ తేజ్ వర్కవుట్స్..

|

Aug 03, 2021 | 9:18 AM

తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి హీరోలు పడే కష్టాల గురించి తెలిసిందే. ముఖ్యంగా.. యాక్షన్స్ థ్రిల్లర్ చూసే మాస్ ప్రేక్షకుల కోసం హీరోలు

Varun Tej: గని కష్టాలు మాములుగా లేవుగా.. జిమ్‏లో వరుణ్ తేజ్ వర్కవుట్స్..
Ghani
Follow us on

తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి హీరోలు పడే కష్టాల గురించి తెలిసిందే. ముఖ్యంగా.. యాక్షన్స్ థ్రిల్లర్ చూసే మాస్ ప్రేక్షకుల కోసం హీరోలు తమ బాడీలను.. యాటీట్యూడ్.. ఇలా ప్రతిదానిలో మార్పులు చేయాల్సిందే. పాత్రకు తగ్గట్టుగా తమను తాము మార్పుకోవడం.. శరీరాకృతిని మార్చుకోవడం కోసం హీరోలు ఎంతో పట్టుదలతో శ్రమిస్తుంటారు. ఇప్పుడు అదే కోవలోకి చేరాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గనీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం వరుణ్ ఎక్కువగానే కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ హీరో.. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేశాడు. అలాగే ఎప్పటికప్పుడూ జిమ్‏లో కఠోరమైన వ్యాయమాలు చేస్తున్నాడు.

తాజాగా వరుణ్ తేజ్ గనీ సినిమా కోసం ప్రిపరేషన్స్‏లో భాగంగా.. జిమ్‏లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాక్ లుక్ లో తీసిన ఈ వీడియోలో వ‌రుణ్ పుల్ అప్స్ తీస్తూ క‌నిపిస్తున్నాడు. హార్డ్ వ‌ర్క్ కు బ్యాక్ అప్ లుండ‌వు అంటూ వీడియోకు క్యాప్షన్స్ ఇచ్చాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇక ఈమూవీకి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ త్వరలోనే విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. న‌వీన్ చంద్ర‌, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌దియా మ‌రో కీ రోల్ చేస్తున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది.

ట్వీట్..

Also Read: Nagarjuna: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా కింగ్ నాగార్జున.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్..

Suriya: మరో రియల్ హీరో కథతో రానున్న సూర్య.. జై భీమ్ సినిమా స్టోరీ ఇదేనా..

Ashwin Babu: అశ్విన్ బాబు మేకోవర్ అదుర్స్.. ఆకట్టుకొంటోన్న ‘హిడింబ’ ఫస్ట్ లుక్ పోస్టర్..