Actor Upendra: మరో కేసులో హీరో ఉపేంద్రకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంలో ఊరటనిచ్చిన హైకోర్టు..
తొలి కేసుపై హైకోర్టు స్టే విధించడంతో హరీష్ కుమార్ యాక్టివ్ అయ్యారు. 'మొదటి కేసులో మాత్రమే స్టే ఇచ్చారు. రెండో కేసు మాత్రం అలాగే కొనసాగుతుంది. దీంతో పోలీసులు ఉపేంద్రను అరెస్ట్ చేయాలి' అంటూ హరీష్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. అలాగే హోంమంత్రి డా.జి.పరమేశ్వర్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు.

సౌత్ హీరో ఉపేంద్ర ఇటీవల చేసిన కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను దుమార రేపిన సంగతి తెలిసిందే. ఉపేంద్ర వ్యాఖ్యలపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అటు ఉపేంద్రపై చన్నమ్మనకెరె అచ్చుకట్టు , హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి . తొలి ఎఫ్‌ఐఆర్‌పై కోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. అదేవిధంగా గురువారం సైతం రెండో ఎఫ్‌ఐఆర్‌పై కూడా కోర్టు స్టే విధించింది. ఇదిలా ఉంటే.. గత వారం ఉపేంద్ర తన రాజకీయ పార్టీ గురించి మాట్లాడేందుకు సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు.
అదే సమయంలో ఉపేంద్ర చేసిన కామెంట్స్ పై దళిత సంఘాలు మండిపడ్డాయి. దీంతో అతనిపై బెంగళూరులోని చన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదేవిధంగా కర్ణాటక రేంజర్స్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు భైరప్ప హరీష్ కుమార్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఉపేంద్ర ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
తొలి కేసుపై హైకోర్టు స్టే విధించడంతో హరీష్ కుమార్ యాక్టివ్ అయ్యారు. ‘మొదటి కేసులో మాత్రమే స్టే ఇచ్చారు. రెండో కేసు మాత్రం అలాగే కొనసాగుతుంది. దీంతో పోలీసులు ఉపేంద్రను అరెస్ట్ చేయాలి’ అంటూ హరీష్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. అలాగే హోంమంత్రి డా.జి.పరమేశ్వర్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు.
ఉపేంద్ర ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇక రెండో ఎఫ్‌ఐఆర్‌పై కూడా స్టే విధించాలని సీనియర్ న్యాయవాది ఉదయ్ హోల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తును వెంటనే విచారించాలని కోరారు. ఈరోజు (ఆగస్టు 17) కర్ణాటక హైకోర్టులో దరఖాస్తు విచారణ జరిగింది. ఒకే అభియోగంపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు కావడంతో రెండో ఎఫ్‌ఐఆర్‌పై కోర్టు స్టే విధించింది.
ఉపేంద్ర ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.