అతనిలా ఎవ్వరూ నటించలేరు.. ఆయన ఎంతో మందికంటే గొప్పవాడు: తనికెళ్ళ భరణి

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి.. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు తనికెళ్ళ భరణి. హీరో, హీరోయిన్స్‌కు తండ్రి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

అతనిలా ఎవ్వరూ నటించలేరు.. ఆయన ఎంతో మందికంటే గొప్పవాడు: తనికెళ్ళ భరణి
Tanikella Bharani

Updated on: Jan 26, 2026 | 11:33 AM

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నారు తనికెళ్ళ భరణి. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.. దర్శకుడిగా మిధునం లాంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించారు. ఇక నటుడిగా ఆయన సినీ ప్రయాణం గురించి ఎంత చెప్పిన తక్కువే.. విలన్ గా ఎం తండ్రి పాత్రల్లో.. అలాగే కామెడీ పాత్రల్లోనూ నటించి విశేషంగా ఆకట్టుకున్నారు. తనికెళ్ళ భరణి. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొందరు నటుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఎల్‌బీ శ్రీరామ్‌తో నాటకరంగంలో తమ బంధం గురించి భరణి మాట్లాడుతూ, తామిద్దరం నాటకాలలో ఆగర్భ శత్రువులం అని సరదాగా పేర్కొన్నారు. శ్రీరామ్‌ను తాను ఆస్కార్ మైల్డ్ అని పిలిచేవాడినని, ఎందుకంటే శ్రీరామ్ నెమ్మదిగా పనిచేస్తే, తాను వేగంగా పనిచేసేవాడినని అన్నారు. ఎల్‌బీ శ్రీరామ్ అత్యంత అంకితభావం కలిగిన నటుడని కొనియాడారు. దర్శకుడు వంశీతో తన అనుభవాలను వివరిస్తూ.. వంశీ తత్వాన్ని అర్థం చేసుకొని, అతన్ని అనుసరించడం చాలా కష్టమని భరణి అన్నారు. వంశీకి సంస్కృతంపై గౌరవం ఉందని అన్నారు. ఇక సినిమా రంగంలో అడ్జెస్ట్మెంట్ చాలా ముఖ్యమని భరణి  అన్నారు. దర్శకుడిగా మారిన తరువాతే, సినిమా కావాలి అన్నప్పుడు పక్కన వాళ్లను తిడుతున్నామా, కొడుతున్నామా అని కూడా తెలియదని, అవి సినిమా పరిశ్రమలో ఎదిగే క్రమంలో చిన్న విషయాలని తనకు అర్థమైందని వివరించారు.

కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు తన కంటే మాత్రమే కాదు, చాలా మంది నటుల కంటే గొప్ప నటుడని అన్నారు. కొందరు తనను శ్రీనివాసరావుకు పోటీగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని, దాని వల్ల శ్రీనివాసరావు బాధపడ్డారని, స్వయంగా తన ఇంటికి వచ్చి ఈ విషయం గురించి మాట్లాడారని తెలిపారు. ఒకానొక సందర్భంలో, శ్రీనివాసరావు చేస్తున్న పాత్రను తనకు ఇవ్వగా, ఆ పాత్రను వేయవద్దని శ్రీనివాసరావు కోరారని, అయితే జీవనాధారం కోసం ఆ పాత్రను తాను తప్పక చేయాల్సి వచ్చిందని భరణి చెప్పారు. ఆ పాత్రను తాను శ్రీనివాసరావు స్థాయిలో చేయలేకపోయానని అన్నారు. రంగస్థలంలో తమ టీమ్ శ్రీనివాసరావు కన్నా పాపులర్  అయినప్పటికీ, సినిమా విషయానికి వస్తే కోటా శ్రీనివాసరావు మహానటుడని, మంచి పాత్రలు లభించడం వల్లనే సినిమా రంగంలో ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నారని భరణి అన్నారు.. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..