Kanguva : థియేటర్లలో డిజాస్టర్.. కట్ చేస్తే.. ఆస్కార్ బరిలో నిలిచిన సూర్య కంగువా..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ సిరుత్తె శివ దర్శకత్వం వహించిన చిత్రం కంగువా. గతేడాది నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా సాగదీత ఎక్కువగా ఉందని రివ్యూస్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది.

Kanguva : థియేటర్లలో డిజాస్టర్.. కట్ చేస్తే.. ఆస్కార్ బరిలో నిలిచిన సూర్య కంగువా..
Kanguva Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 07, 2025 | 1:18 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇటీవల సూర్య నటించిన కంగువా చిత్రం మాత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. దాదాపు 2 ఏళ్ల కాలవ్యవధిలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. కానీ ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోకపోవడం.. కథనం కంటిన్యూగా లేకపోవడంతో ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో అటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సైతం తగ్గిపోయాయి.

ఇదెలా ఉంటే.. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఆస్కార్‌కి ఎంపికైన చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో కంగువా సినిమా చేరింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.400 కోట్లతో నిర్మించగా.. కేవలం రూ.105 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం సూర్య డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి ఏప్రిల్‌లో విడుదల కానుందని అంటున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తోంది.

ఈ సినిమాతోపాటు సూర్య డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య సరసన నటిస్తోంది త్రిష. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.