Suman : కర్నూలు జిల్లాలో దేవాలయానికి హీరో సుమన్..ఆ ఆలయ విశిష్ట ఏంటో తెలుసా.?

| Edited By: Rajeev Rayala

Jun 25, 2024 | 2:50 PM

భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పంచాయతన దేవాలయం ఒకే ఆలయంలో ఐదు గర్భగుళ్లు నిర్మించడం విశేషం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునఃనిర్మాణం భాగంగా దేశంలో ఎక్కడా లేనటువంటి పంచాయతన దేవాలయంగా ఐదు గర్భ గుళ్ళతో ప్రసిద్ధి చెందుతున్న దేవాలయం.

Suman : కర్నూలు జిల్లాలో దేవాలయానికి హీరో సుమన్..ఆ ఆలయ విశిష్ట ఏంటో తెలుసా.?
Suman
Follow us on

కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్మాణంలో ఉన్న పంచాయతన దేవాలయాన్ని సందర్శించారు హీరో సుమన్.. దాదాపు 10 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న దేవాలయానికి హీరో సుమన్ ను గౌరవ అధ్యక్షులుగా ప్రకటించారు దేవస్థాన కమిటీ చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి.  హీరో సుమన్ కు శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు కమిటీ సభ్యులు. అనంతరం దేవాలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేశారు హీరో సుమన్.

భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పంచాయతన దేవాలయం ఒకే ఆలయంలో ఐదు గర్భగుళ్లు నిర్మించడం విశేషం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునఃనిర్మాణం భాగంగా దేశంలో ఎక్కడా లేనటువంటి పంచాయతన దేవాలయంగా ఐదు గర్భ గుళ్ళతో ప్రసిద్ధి చెందుతున్న దేవాలయం. ఎటువంటి ఇటుకలు, గ్రానైట్,టైల్స్, సిమెంట్ ఏమాత్రం లేకుండా కేవలం రాతికట్టుకం రాతి విగ్రహాలతో నిర్మాణం దాదాపు 10 కోట్లకు పైగా వ్యయంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునఃనిర్మాణంలో భాగంగా ఒకే ఆలయంలో ఐదు గర్భగుళ్లు 1 విఘ్నేశ్వరుడు, 2 శ్రీ సూర్య భగవానుడు, 3 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, 4 శ్రీ శివుడు, 5 శ్రీ అంబికా దేవి, ఈ ఐదుగురి దేవతామూర్తుల 5 గర్భగుళ్ళు ఒకే ఆలయంలో ఉండడం దేశంలో మొట్టమొదట దేవాలయం కోడుమూరులో తప్ప మరి ఎక్కడ లేదని చెప్పవచ్చు.

పంచాయతన దేవాలయాన్ని ఎటువంటి ఇటుక సిమెంటు లేకుండా అఖండ రాతితో నిర్మించడం ప్రత్యేకం. వేల సంవత్సరాలు తరతరాలుగా గడిచిన చెక్కుచెదరకుండా ఉండాలని దృఢసంకల్పంతో ఈ ఆలయ కమిటీ సభ్యులు ఈ అద్భుత కట్టడం చేపట్టడం విశేషం. దాతల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని ఆలయ విధానాలను ఇంకా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేనటువంటి నిత్య రథోత్సవం నిత్య అన్నదానం, ఏడు కళ్యాణ మండపాలు నిర్మించి ప్రతి ఒక్కరికి ఉచితంగా పెళ్లిళ్లకు ఇవ్వాలని నిర్ణయించారు కమిటీ సభ్యులు. ఏడు కళ్యాణ మండపాలకు నామకరణం (1గరుడాద్రి) (2 వృషభద్రి ) (3 అంజనాద్రి)(4 నీలాద్రి ) (5 శేషాద్రి) (6 వెంకటాద్రి) ( 7 నారాయణాద్రి) ఇలా ఏడు కళ్యాణ మండపాలకు ఏడుకొండల వెంకన్న నామకరణాలు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు.