
సీనియర్ నటుడు సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా స్టార్‌డమ్ సంపాదించాడు. అయితే క్రమంగా టాప్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో.. కొన్ని ఊహించని వివాదాలు సుమన్ జీవితం, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. మరి ఇంతకీ ఆ వివాదాలతో వచ్చిన పుకార్ల అంశంపై సుమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను జైలు పాలవ్వడానికి అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్, రాష్ట్ర డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ వాడియార్‌లే ప్రధాన కారణం అని పేర్కొన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి సుమన్‌పై హై-లెవెల్ స్కెచ్ వేసి ఇరికించారట. ఆ సమయంలో సుమన్ మంచి అందగాడు, చాలా పాపులారిటీ సాధించాడు. డీజేపీ కుమార్తె సుమన్‌పై ఇష్టం పెంచుకుందట. అయితే అప్పటికే ఆమెకు పెళ్లైంది. అలాగే సుమన్ షూటింగ్ ఎక్కడున్నా.. పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళేదట. ఇక ఆమెపై సుమన్‌కు ఎలాంటి ఇష్టం లేదు. అలాగే సుమన్ స్నేహితుడు ఒకడు లిక్కర్ కాంట్రాక్టర్ వాడియార్ కుమార్తెను ప్రేమించాడు.
డీజేపీ కుమార్తె వ్యవహారం ఎంజీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సుమన్‌ను పిలిపించారు. ఆ సమయంలో ఎంజీఆర్ మాట్లాడే స్థితిలో లేకపోవడంతో రాసి చూపించారు. ‘బాబు నువ్వు నటుడివి. నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఇలాంటివి వద్దు’ అని ఎంజీఆర్ సుమన్‌కు సలహా ఇచ్చారు. దీనికి సుమన్ ‘ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది, ఆ అమ్మాయికి’ అని సున్నితంగానే బదులిచ్చాడట. సుమన్ ఇచ్చిన ఈ సమాధానం ఎంజీఆర్‌కు నచ్చలేదని.. అది తప్పుగా పోట్రే అయింది. ఎంజీఆర్‌కు కోపమొచ్చి.. డీజేపీతో కలిసి తన అధికారాన్ని ఉపయోగించి సుమన్‌పై అల్లర్ల కేసు పెట్టి అరెస్టు చేయించారట. లోలోపల అనేక కేసులు బనాయించినప్పటికీ, బ్లూ ఫిలిం కేసు కూడా పెట్టారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఈ బ్లూ ఫిలిం కేసు వట్టి పుకార్లనేట. సుమన్ స్నేహితుడు ఒకరికి క్యాసెట్ల షాప్ ఉండటంతో ఆ సమయంలో ఈ పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని నెలల పాటు సుమన్ జైలు జీవితం గడిపారు. సుమన్ తల్లికి గవర్నర్ బాగా తెలియడంతో త్వరగానే బెయిల్ వచ్చింది. కానీ, జైలు నుంచి బయటకు వచ్చేసరికి సుమన్ నమ్మి డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు, ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులను ఎదుర్కున్నాడట.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..