Sonu Sood: నువ్వు చల్లగా ఉండాలయ్యా… ముడేళ్ల చిన్నారికి ఫ్రీగా హార్ట్ సర్జరీ చేయించిన సోనూ సూద్‌

మానవత్వం పరిమళించిన మనస్తత్వం. ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే ఆశాకిరణం. రియల్ లైఫ్ హీరో సోనూసూద్.. మరోసారి తన మంచి తననాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు. మూడేళ్ల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి.. రియల్ హీరో అనిపించుకున్నారు.

Sonu Sood: నువ్వు చల్లగా ఉండాలయ్యా... ముడేళ్ల చిన్నారికి ఫ్రీగా హార్ట్ సర్జరీ చేయించిన సోనూ సూద్‌
Sonu Sood
Follow us

|

Updated on: Oct 20, 2024 | 12:35 PM

తెరమీద విలన్‌ పాత్రల్లో కనిపించే సోనూ సూద్‌లోని హీరోను- లాక్‌డౌన్‌- ప్రపంచానికి పరిచయం చేసింది. సొంతూళ్లకు వెళ్లలేని వలసకూలీలు నడుస్తూ నడుస్తూ ప్రాణాలు కోల్పోవడం- అత్యంత భయంకరమైన సంక్షోభాన్ని కళ్లకు కట్టింది. ఎంతోమంది వలసకూలీలు, పేదలు, విద్యార్థులు సోనూ సూద్‌ను కదిలించారు. ఈ ఒక్క వ్యక్తి అడుగు ముందుకేసి, ఎంతోమందికి భరోసాగా మారాడు. తమను సొంతూళ్లకు తరలించాలంటూ ప్రభుత్వానికి సరిసమానంగా వినతులు సోనూసూద్‌కు వెళ్లాయి. విదేశాల నుంచి విన్నపాలు వచ్చాయి. పలు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. సోనూ సూద్‌ ఎంతోమందికి సాయం చేశారు. ఈ మానవత్వం అంతర్జాతీయంగా ప్రశంసాపూర్వకంగా మారింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ది కార్యక్రమం సోనూ సూద్‌ను గౌరవించింది. ఆయనకు SDG స్పెషల్‌ హ్యుమానటేరియన్‌ అవావార్డును ప్రకటించింది. ఈ పురస్కారంతో సోనూ సూద్‌ పేరు మళ్లీ మార్మోగిపోయింది. సోనూసూద్‌ ఇప్పుడు అంతర్జాతీయ ప్రముఖుల సరసన చేరారు. ఏంజెలినా జోలి, డేవిడ్‌ బెక్‌హామ్‌, లియోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్‌, లియామ్ నీసన్‌లాంటి వాళ్ల సరసన సోనూసూద్‌ని ప్రపంచం నెలబెట్టింది.

అక్కడితో ఆగలేదు ఆయన. ఎవరైనా సాయం అంటే చాలు ఎగబడి వెళ్లిపోయాడు. కష్టంలో ఉన్నామని మెసేజ్ చేస్తే రెస్సాండ్ అయ్యాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ఇద్దరు కూతుళ్లుతో దుక్కి దున్నుతున్న రైతు కష్టానికి చలించి.. వాళ్ల ఇంటికి కొత్త ట్రాక్టర్‌ను పంపించి ఔరా అనిపించుకున్నాడు. పేద విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అందుకే అతడిని ప్రజలు రియల్ హీరోగా కీర్తిస్తున్నారు. తాజాగా మూడేళ్ల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి తమ మంచి మనసును మరోసారి చాటుకున్నాడు సోనూసూద్.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన కృష్ణ, బిందుప్రియల దంపతులది నిరుపేద కుటుండం. రెక్కాడితే కానీ డొక్కాడదు. వీరి మూడేళ్ల కూతురు చిన్నప్పటినుంచే గుండె సమస్యతో ఇబ్బంది పడుతోంది. చిన్నారి గుండెకు సర్జరీ చేయించాలంటే ఆపరేషన్‌కు రూ.6 లక్షలకుపైగా ఖర్చువుతుందని వెద్యులు చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని కృష్ణ, బిందుప్రియ దంపతులు దేవుడే తమ బిడ్డని కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ తెలియజేసింది. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ పాపకు ముంబైలో ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతంచిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కష్టకాలంలో చిన్నారి ప్రాణాలు నిలబెట్టిన సోనూసోద్‌ను ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దేవి కుమారి అనే యువతి చదువుకోవడానికి సోనూసూద్  హెల్ప్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.