మాంసాహార వంటల్లోనూ బిర్యానీల్లోనూ మసాలాద్రవ్యాలు తప్పనిసరిగా వాడుతాం.. అప్పుడే ఆ వంటకాలకు అంత రుచి అందుతుంది. ఆ ఆహారాలు అంతలా గుబాళిస్తాయి. ఆ కోవకే చెందినదే జాపత్రీ. ఇది చూసేందుకు ఓ పువ్వులా కనిపిస్తుంది. కానీ, జాజికాయని ఓ లేసుపొరలా చుట్టుకుని ఉండే సుగంధ ద్రవ్యం. అయితే, ఈ రెండింటి రుచీ ఒకేలా ఉండదు.