Madharasi Teaser: మాస్ అవతారంలో శివకార్తికేయన్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న మదరాసి టీజర్.. చూశారా.. ?

డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో SK23 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్న సినిమాలో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్, టైటిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు మధరాసి అనే టైటిల్ ఖారారు చేసినట్లు వెల్లడించారు. ఈరోజు హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది.

Madharasi Teaser: మాస్ అవతారంలో శివకార్తికేయన్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న మదరాసి టీజర్.. చూశారా.. ?
Madharasi Teaser

Updated on: Feb 17, 2025 | 4:28 PM

గతేడాది అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈసినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. దీపావళీ కానుకగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘మదరాసి’. శివకార్తికేయన్ ‘అమరన్’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందించారు. కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్న దర్శకుడు మురుగదాస్ ఈ సంవత్సరం రెండు మేజర్ ఫిలిమ్స్ అందించబోతున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది. ఈరోజు, శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి యాక్షన్-ప్యాక్డ్ గ్లింప్స్ తో ఈ చిత్రం టైటిల్ ‘మదరాసి’ని రివిల్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ పూర్తిగా పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. ఈ గ్లింప్స్ సినిమాలోని ఇతర కీలక పాత్రలను కూడ పరిచయం చేస్తుంది.

టైటిల్ గ్లింప్స్‌లో సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ హై-క్లాస్ విజువల్స్ ఆకట్టుకున్నాయి, రాక్‌స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ తన ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్‌తో విజువల్స్‌ను ఎలివేట్ చేశాడు. తన ఇంటన్సీవ్ నెరేటివ్ గ్రిప్పింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆకట్టుకునే ఎఆర్ మురుగదాస్ మదరాసితో సరికొత్త ఎక్సయిటింగ్ యాక్షన్-ప్యాక్డ్ కథను చూపించబోతున్నారని గ్లింప్స్ ప్రామిస్ చేస్తోంది.

హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు ఇది మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ కొరియోగ్రఫీని కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ పర్యవేక్షిస్తారు. టైటిల్ రివీల్, గ్లింప్స్ ఈ హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ కోసం ఎక్సయిట్మెంట్ పెంచాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన