Sivakarthikeyan: హీరో శివకార్తికేయన్‌ కుమారుడి బారసాల.. ఏం పేరు పెట్టారో తెలుసా? వీడియో ఇదిగో

|

Jul 15, 2024 | 11:35 AM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ ఇటీవలే మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య ఆర్తి జూన్ 2న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు ఇప్పటికే కూతురు ఆరాధన, కుమారుడు గుగున్ ఉన్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అబ్బాయి పుట్టాడు.

Sivakarthikeyan: హీరో శివకార్తికేయన్‌ కుమారుడి బారసాల.. ఏం పేరు పెట్టారో తెలుసా? వీడియో ఇదిగో
Sivakarthikeyan Family
Follow us on

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ ఇటీవలే మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య ఆర్తి జూన్ 2న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు ఇప్పటికే కూతురు ఆరాధన, కుమారుడు గుగున్ ఉన్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అబ్బాయి పుట్టాడు. దీంతో శివ కార్తికేయన్ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. తాజాగా తమ మూడో అబ్బాయికి బారసాల నిర్వహించారు శివ కార్తికేయన్ దంపతులు. ఈ సందర్భంగా తమ పిల్లాడికి పవన్ అని నామకరణం చేశారు. అనంతరం బారసాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు శివ కార్తికేయన్. అలాగే ప్రసవ సమయంలో తన సతీమణి భార్య పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యాడు. ‘ఆర్తి.. ఆపరేషన్‌ థియేటర్‌లో పిల్లల్ని కనేటప్పుడు నువ్వు ఎంత నరకం చూశావో నేను కళ్లారా చూశాను. ఆ బాధను భరిస్తూ నాకు అందమైన ప్రపంచాన్ని ఇచ్చావ్. నీకు ఎప్పటికీ నీకు కృతజ్ఞుడినై ఉంటాను. లవ్యూ..’ అని తన భార్యపై ప్రేమను కురిపించాడీ హీరో. ఇక వీడియో చివర్లో ఆరాధన- గుగన్‌ – పవన్‌ అంటూ తన ముగ్గురి పిల్లల పేర్లు ప్రస్తావించాడు.

శివకార్తికేయన్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శివ కార్తికేయన్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరో ఫ్యామిలీ ఎంతో క్యూట్ గా ఉన్నారంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కాగా శివకార్తికేయన్ తమ దగ్గరి బంధువు అమ్మాయి అయిన ఆర్తిని 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2013లో కూతురు ఆరాధన జన్మించింది. 2021 లో బాబు గుగున్ జన్మించాడు. ఇప్పుడు మూడోసారి అబ్బాయి పుట్టాడు.

ఇవి కూడా చదవండి

బారసాల వీడియో ఇదిగో

ఇక యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన శివకార్తికేయన్‌ ఆ తర్వాత నటుడిగా మారాడు. మొదట స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించిన అతను ఆ తర్వాత వారికే పోటీగా స్టార్ హీరోగా ఎదిగాడు. మహా వీరుడు, ప్రిన్స్, అయలాన్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యాడు శివ కార్తి కేయన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.