Manmadha Movie: 20 ఏళ్లకు మళ్లీ థియేటర్లలో సూపర్ హిట్ మూవీ.. ‘మన్మధ’ రీరిలీజ్ ఎప్పుడంటే..

|

Sep 28, 2024 | 10:15 AM

ఇప్పటికే ప్రభాస్, చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు చిత్రాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురాగా.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓయ్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో డబ్బింగ్ చిత్రాలను కూడా రీరిలీజ్ చేస్తున్నారు. 2004లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయిన చిత్రం 'మన్మధ'. కోలీవుడ్ హీరో శింభు హీరోగా నటించిన ఈ చిత్రంలో జ్యోతిక కథానాయికగా నటించింది.

Manmadha Movie: 20 ఏళ్లకు మళ్లీ థియేటర్లలో సూపర్ హిట్ మూవీ.. మన్మధ రీరిలీజ్ ఎప్పుడంటే..
Manmadha
Follow us on

సౌత్‏లో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్‏లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. మొదట్లో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలను 4కే వెర్షన్ లో రిలీజ్ చేశారు. ఆ చిత్రాలకు మంచి రెస్పాన్స్ తోపాటు.. భారీగా వసూళ్లు కూడా వచ్చాయి. దీంతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద హిట్టయిన చిత్రాలతోపాటు.. డిజాస్టర్స్ కూడా మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్, చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు చిత్రాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురాగా.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓయ్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో డబ్బింగ్ చిత్రాలను కూడా రీరిలీజ్ చేస్తున్నారు. 2004లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయిన చిత్రం ‘మన్మధ’. కోలీవుడ్ హీరో శింభు హీరోగా నటించిన ఈ చిత్రంలో జ్యోతిక కథానాయికగా నటించింది.

తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా భారీ విజయం సాధించింది. ఇప్పుడు యూత్ నచ్చిన ఆర్ఎక్స్ 100, బేబీ సినిమాల మాదిరిగానే.. అదే పాయింట్ తో దాదాపు 20 ఏళ్ల క్రితమే వచ్చిన ఈ మూవీ హిట్ అయ్యింది. ఇక ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వింటూనే ఉన్నాము. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 5న మన్మధ 4కే వెర్షన్ రీరిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఇప్పుడు ఈ చిత్రాన్ని సాయి సుధా రాజకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయాస్, రమణ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే శింభు కావడం విశేషం. ఇందులో సింధు తులాని, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక కీలకపాత్రలు పోషించగా.. ఏజే మురగన్ దర్శకత్వం వహించారు. ఇందులో శింభు డ్యూయల్ రోల్ పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.