Sharwanandh: మెగాహీరోలతో శర్వానంద్ న్యూఇయర్ సెలబ్రెషన్స్.. చిరు.. చెర్రీ మధ్యలో శర్వా క్యూట్ స్మైల్..

|

Jan 01, 2023 | 10:33 AM

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ నెట్టింట కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలుపగా.. తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ సైతం ఫాలోవర్లకు విషెస్ తెలిపారు. అయితే విష్ చేస్తూ శర్వా షేర్ చేసిన ఫోటో చక్కర్లు కొడుతుంది.ఈ ఏడాది న్యూఇయర్ సెలబ్రెషన్స్ తన స్నేహితుడు రామ్ చరణ్ ఇంట్లో జరుపుకున్నట్లుగా తెలుస్తోంది.

Sharwanandh: మెగాహీరోలతో శర్వానంద్ న్యూఇయర్ సెలబ్రెషన్స్.. చిరు.. చెర్రీ మధ్యలో శర్వా క్యూట్ స్మైల్..
Megastar Chiranjeevi, Sharw
Follow us on

కొత్త సంవత్సరాన్ని మరింత కొత్తగా ప్రారంభిస్తున్నారు. ఏడాది మొత్తం సంతోషంగా ఉండేందుకు..మొదటిరోజునే అత్యంత ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు సినీ వర్గాల్లో నూతన సంవత్సర సంబరాలు మొదలయ్యాయి. టాలీవుడ్ స్టార్స్ తమ కుటుంబసభ్యులు.. సన్నిహితులతో కలిసి గ్రాండ్ గా సెలబ్రెషన్స్ జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను న్యూఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ నెట్టింట కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలుపగా.. తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ సైతం ఫాలోవర్లకు విషెస్ తెలిపారు. అయితే విష్ చేస్తూ శర్వా షేర్ చేసిన ఫోటో చక్కర్లు కొడుతుంది.ఈ ఏడాది న్యూఇయర్ సెలబ్రెషన్స్ తన స్నేహితుడు రామ్ చరణ్ ఇంట్లో జరుపుకున్నట్లుగా తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‏లతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. న్యూఇయర్ విషెస్ తెలిపారు శర్వానంద్. చాలా రోజుల తర్వాత మెగా హీరోలతో కలిసి శర్వానంద్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరు ముగ్గురు కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్నారు శర్వానంద్. ఇందులో అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.