AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: ‘ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి’.. సమంత ఆరోగ్యంపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత ఆరోగ్యం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Rana Daggubati: 'ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి'.. సమంత ఆరోగ్యంపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..
Rana, Samantha
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2023 | 8:25 PM

Share

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు హీరో రానా దగ్గుబాటి. హీరోయిజం అని కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రతినాయకుడిగానూ మెప్పించిన రానా.. ప్రస్తుతం రానానాయుడు వెబ్ సిరీస్‏లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ సైతం కీలకపాత్రలో నటించారు. ఈ సిరీస్ మార్చి 10న నెట్ ఫ్లిక్స్‎లో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్ కు రీమేక్ గా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత ఆరోగ్యం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తమ వ్యక్తిగత సమస్య గురించి బహిరంగంగా చెప్పినప్పుడు నటీనటులు ప్రజల గొంతుకగా మారగలరా అని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరికి తమ స్వంత అభిప్రాయం ఉంటుందని.. ప్రతి ఒక్కరు దాని గురించి ఎలా మాట్లాడతారు.. మిగతవారు మాట్లాడేప్పుడు ఎలా ఉంటుందనేది ముఖ్యమన్నారు.

“సమంత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియగానే నేను ఆమెను సంప్రదించాను. మేము ఎప్పుడూ మాట్లాడుకుంటాము. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎవరి జీవితం సాఫీగా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేది ఒకటి ఉంటుంది. అది ఆరోగ్య సమస్య కూడా కావచ్చు. అలాంటి సమయంలో మనం ఎలా వ్యవహరిస్తాము.. దాని గురించి ఎలా స్పందిస్తామనేది. ఈ సమస్యల గురించి అందరూ విచారంగా కూర్చుని మాటాడుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు విచారించే విషయాలు జరగడం కూడా ముఖ్యమే. ఆత్మవిశ్వాసంతో తిరిగి లేచి ముందుకు సాగడమే ముఖ్యం” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.