AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: ది వారియర్ షూటింగ్ పూర్తి చేసిన ఎనర్జిటిక్ స్టార్.. విడుదలయ్యేది అప్పుడే..

తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో కనిపించనున్నాడు.

Ram Pothineni: ది వారియర్ షూటింగ్ పూర్తి చేసిన ఎనర్జిటిక్ స్టార్.. విడుదలయ్యేది అప్పుడే..
Ram Pothineni
Rajitha Chanti
|

Updated on: May 29, 2022 | 6:28 AM

Share

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం ది వారియర్ (The Warriorr). తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శనివారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉందని చెబుతున్నారంతా. టీజర్‌లో డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా హై స్టాండ‌ర్డ్స్‌లో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. గత వారం రోజులుగా మా హీరో రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించాం. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాం. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తాం. త్వరలో మిగతా పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆల్రెడీ విడుదలైన ‘బుల్లెట్…’ సాంగ్ అందరి నోట వినబడుతోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో రామ్, కృతి శెట్టి వేసిన స్టెప్స్ వేస్తూ యంగ్‌స్ట‌ర్స్ రీల్స్‌ చేస్తున్నారు. పోస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ పాటకు 55 మిలియన్ వ్యూస్ రావడం సంతోషంగా ఉంది” అని చెప్పారు.