Rajinikanth: ఆసుపత్రిలో చేరిన రజినీకాంత్.. ఆందోళనలో ఫ్యాన్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు రజినీ. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. అయితే రజినీ ఆసుపత్రిలో చేరడంపై అటు వైద్యులు,

Rajinikanth: ఆసుపత్రిలో చేరిన రజినీకాంత్.. ఆందోళనలో ఫ్యాన్స్..
Rajinikanth
Follow us

|

Updated on: Oct 01, 2024 | 7:04 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు రజినీ. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. అయితే రజినీ ఆసుపత్రిలో చేరడంపై అటు వైద్యులు, ఇటు కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మంగళవారం రజినీకి ఎలక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజినీ వయసు 73 సంవత్సరాలు. కొన్నిరోజులుగా వేట్టయాన్, కూలీ చిత్రాల షూటింగ్స్‏లో పాల్గొంటున్నాడు రజినీ.

ఇదిలా ఉంటే.. జై భీమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ చిత్రం అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో