Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghu Babu: మీరేంటండీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు..! ప్రొఫిషనల్ సింగర్‌లా..

కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు రఘుబాబు. చాలా సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు. అలాగే రఘుబాబు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈయన పంచ్ లకు థియేటర్స్ లో పడీపడీ నవ్వాల్సిందే.. దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ రఘుబాబు నటించారు. నటన మాత్రమే కాదు రఘుబాబులో మరో టాలెంట్ ఉంది.

Raghu Babu: మీరేంటండీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు..! ప్రొఫిషనల్ సింగర్‌లా..
Raghu Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 16, 2024 | 10:46 AM

ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు రఘుబాబు. ప్రముఖ నటుడు గిరిబాబు కొడుకు రఘుబాబు. తండ్రి కొడుకులు ఇద్దరూ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు రఘుబాబు. చాలా సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు. అలాగే రఘుబాబు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈయన పంచ్ లకు థియేటర్స్ లో పడీపడీ నవ్వాల్సిందే.. దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ రఘుబాబు నటించారు. నటన మాత్రమే కాదు రఘుబాబులో మరో టాలెంట్ ఉంది. తాజాగా  ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రఘుబాబు ఓ పాటను ఆలపించారు. శ్రీదేవి , కమల్ హాసన్ నటించిన వసంత కోకిల సినిమాలోని కథగా కల్పనగా అనే సాంగ్ ను తమిళ్ వర్షన్ లో పాడారు రఘుబాబు. ఎంతో అద్భుతంగా ప్రొఫిషనల్ సింగర్ లా ఆ పాటను ఆలపించారు రఘుబాబు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. రఘుబాబు తమిళ్ లో పాట పాడటంతో దేశముదురు సినిమాలో తమిళ్ నేర్చుకొని ఇప్పుడు పాట పడుతున్నారు అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అద్భుతంగా పాడారు అని కొనియాడుతున్నారు. మరికొంతమంది నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో రఘుబాబు పాడిన లంగావోణీ సాంగ్ సీన్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా నిజంగా రఘుబాబు అద్భుతంగా పాడారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు