కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యన తన సినిమాల కంటే తన సేవా కార్యక్రమాలే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తన స్వయంకృషితో ఎదిగిన ఆయన ఎంతో మంది అనాథలు, పేద పిల్లలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇక ఇటీవల తన సేవా కార్యక్రమాల్లో మరింత డోస్ పెంచారు. పేద రైతులకు ట్రాక్టర్లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు.. ఇలా చేయి చాచి అడిగిన ప్రతి ఒక్కరికీ సాయం చేసుకుంటూ పోతున్నారు రాఘవ లారెన్స్. ఇదిలా ఉంటే తాజాగా తన సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు లారెన్స్. సుమారు 20 ఏళ్లుగా వారికి అన్నీ తానే నడిపిస్తున్నారీ రియల్ హీరో. ఇప్పుడు ఆ విద్యార్థులంతా చదువుల్లో అమోఘంగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసిన రాఘవ లారెన్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా పిల్లలతో కలిసిపోయి లారెన్స్ కూడా ఆటలు ఆడారు. పాటలు పాడారు. డ్యాన్సులు చేశారు. అందరూ కలిసి సరదాగా సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేశారు లారెన్స్. తన పిల్లలను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందన్నారు. వారిని కలిసి సమయం వెచ్చించడంతో తన మనసు సంతోషంతో నిండిపోయిందన్నారు లారెన్స్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు లారెన్స్ మంచి మనసుకు ఇది మరో నిదర్శనం.. మీరు చాలా గ్రేట్ సార్.. మీ సేవా కార్యక్రమాలు ఎల్లకాలం ఇలాగే కొనసాగాలంటూ ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
The seeds I planted 20 years ago have now grown into these beautiful souls and are being a good example in society. I’m extremely proud of my boys and girls for the kind of persons they have grown into. My heart is so full after spending some beautiful and quality time with them.… pic.twitter.com/XjytGqj2OW
— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2024
Hi friends and fans! I am excited to announce that Maatram’s service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb
— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024
Hi friends and fans! I am proud to introduce my special boys, who have undergone physical challenges, to you all. This tradition is called Mallakhamba and they are incredibly talented. I humbly request you all to consider booking them for your events, shows, and functions using… pic.twitter.com/AUu0EzfUQ3
— Raghava Lawrence (@offl_Lawrence) April 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.