ఆర్. నారాయణమూర్తి ప్రేమకథ.. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఇంత త్యాగమా..!!

|

Dec 19, 2024 | 5:36 PM

ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించిన నారాయణ మూర్తి.. తెలుగు తెరపై విప్లవాత్మక భావాల ఎర్రదనాన్ని ప్రజారంజకంగా అద్దుతూ వస్తున్నారు. సినిమా హీరో అవ్వాలని వచ్చి.. అవకాశాలు దొరకకపోయినా విసుగు చెందకుండా..దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తూ అవకాశాలు అందుకున్నారు.

ఆర్. నారాయణమూర్తి ప్రేమకథ.. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఇంత త్యాగమా..!!
R Narayana Murthy
Follow us on

ఆర్. నారాయణమూర్తి.. ఈ పేరు తెలియనని ప్రేక్షకులు ఉండరు.  సినిమా ఇండస్ట్రీలో ఆయనది ఓ సపరేట్ స్టైల్. కెమెరా ముందు వెనకా ఒకేలా ఉండే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. విప్లవ ప్రధానమైన సినిమాలను నిర్మించి, నటించారు ఆర్ నారాయణమూర్తి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి. సినిమాలలో ఆసక్తితో ఎన్టీయార్, నాగేశ్వరరావుల సినిమాలు చూసి ఎలాగైనా సినిమాల్లో నటించాలని అనుకున్నారు. అలాగే సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు. ఆయన సినిమాల్లోనూ విప్లవ భావాలే కనిపిస్తాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు, నటించారు నారాయణమూర్తి. దాసరి నారాయణరావు గారి పరిచయం వలన కృష్ణ సినిమా నేరము-శిక్షఈయనకు ఒక చిన్నపాత్రలో నటించే అవకాశం వచ్చింది.

ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు

ఆతర్వాత వరుసగా సినిమాలు చేశారు. ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాలు చేసి మెప్పించారు నారాయణమూర్తి ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతారు. నారాయణమూర్తి నిర్మాత, నటుడు, హేతువాది, అవివాహితుడు. అయితే నారాయణమూర్తికి ఓ ప్రేమ కథ కూడా ఉంది. ఓ అమ్మాయిని ఆయన ఎంతగానో ఆరాధించారు. కానీ ఆ ప్రేమకథ సుఖంతం కాలేదు. ఓ ఇంటర్వ్యూలో ఆర్. నారాయణమూర్తి  మాట్లాడుతూ తన ప్రేమ కథ చెప్పారు.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. తన ప్రేమ కథ చెప్పారు. మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా.? అన్న ప్రశ్నకు నారాయణమూర్తి ఆన్సర్ ఇస్తూ..” ప్రేమించాను.. ఓ అమ్మాయి నన్ను మనస్పూర్తిగా అభిమానించింది.. నేను కూడా ఆమెను మనస్పూర్తిగా  అభిమానించా.. అయితే ఓ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను వాళ్ళ పేరెంట్స్ కు పరిచయడానికి రమ్మంటే వెళ్ళాను. మొదటిసారి ఆమె ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు. నా జీవనవిధానం వేరు.. వాళ్ళ జీవనవిధానం వేరు. అప్పుడు అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసా.. నాది ఫ్లాట్ ఫారం బ్రతుకు.. ఆమె చాలా డబ్బున్న అమ్మాయి. నా భార్యను నేను మంచిగా చూసుకోవాలి. నాలా ఫ్లాట్ ఫారం మీద పెట్టకూడదు. నా కోరిక సినిమాల్లో చేయడం. నాకు అవకాశాలు వస్తాయో.. రావో.. ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ఎందుకు.? ఇప్పుడు పెళ్లి చేసుకొని. ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని ఆమె జీవితాంతం నయరకయాతన పడటం అని.. ఆమెకు వివరంగా చెప్పి.. నన్ను అపార్ధం చేసుకోకండి.. మీరు వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. నేను మద్రాసు వెళ్లిపోతున్నా.. మళ్లీ ఉత్తరాలు రాసుకోవడం వంటివి వద్దు. మీరు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశా .. అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. ఆతర్వాత ఆమెతో టచ్ లో లేను. ఆమె ఎక్కడో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఆమెను చూడాలనిపిస్తుంది.. మళ్ళీ వెళ్లి ఆమెను చూసి నేను బాధపడాలి ఎందుకు అని వదిలేశా.. అని అన్నారు ఆర్. నారాయణమూర్తి. నిజంగా ఎంత గొప్ప ప్రేమకథ కదా.. ! ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలని .. తనను పెళ్లిచేసుకొని జీవితం నాశనం చేసుకోకూడదు అని ఆ ప్రేమనే త్యాగం చేశారు నారాయణమూర్తి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.