AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది : అక్కల సుధాకర్

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత అయితే దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి)ని ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు తన పుట్టిన రోజు (డిసెంబర్ 18) సందర్భంగా పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. దిల్ రాజును ప్రముఖులు కలుస్తూ ఆయనకు విషెస్ తెలుపుతున్నారు.

Dil Raju: దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది : అక్కల సుధాకర్
Dil Raju
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2024 | 5:31 PM

Share

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం పట్ల సినీ పరిశ్రమ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌డీసీ చైర్మన్ గా దిల్ రాజు నియామకం పట్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యుడు అక్కల సుధాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్ రాజును మర్యాదపూర్వకంగా ఆయన కలిసి హృదపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో చిత్ర పరిశ్రమ ఎదుగుదల, భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు

సినిమాపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఎఫ్‌డీసీ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. “దిల్ రాజు గారి అనుభవం, దృక్పథం నిస్సందేహంగా తెలంగాణ ఎఫ్‌డీసీని కొత్త శిఖరాలకు నడిపిస్తుంది” అని సుధాకర్ పేర్కొన్నారు. చలనచిత్ర రంగాన్ని అభివృద్ధిపర్చడంలో పరిశ్రమ ప్రముఖుల ప్రాముఖ్యతను చర్చించారు.  ఈ సమావేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, స్థానికంగా ఉన్న టాలెంట్ ను ప్రోత్సహించడానికి, సినిమా నిర్మాణానికి తెలంగాణను ఒక ప్రధాన గమ్యస్థానంగా నిలబెట్టడానికి చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపైనా చర్చించారు.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

దిల్ రాజు నాయకత్వంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. సినిమా నిర్మాతలకు అవకాశాలను సృష్టించడం అలాగే పరిశ్రమ నిపుణులకు మద్దతు ఇవ్వడంపై మళ్లీ దృష్టి పెడుతుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దిల్ రాజు బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్స్ ద్వారా టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వడంలో ఆసక్తి కనబర్చే దిల్ రాజు నాయకత్వం పరిశ్రమలో అంతరాలను తగ్గించి, స్థిరమైన వృద్ధిని పెంపొందిస్తుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. దిల్ రాజు నియామకం.. చలనచిత్ర రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన అడుగు అని సినీరంగ ప్రముఖులు, నిపుణుల  నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?