
టాలీవుడ్ ప్రముఖ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన గొర్రెల కామెంట్స్ ఎంత రచ్చ రాజేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించే పృథ్వీ కామెంట్స్ చేశాడంటూ ట్విట్టర్ లో ఏకంగా బాయ్ కాట్ లైలా ట్రెండ్ అయ్యింది. విశ్వక్సేన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. కారణాలేమైనా లైలా మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఈ వివాదం చల్లబడుతుండగానే మరోసారి వార్తల్లోకి వచ్చాడు పృథ్వీ రాజ్. ‘నేను ట్విట్టర్ (ఎక్స్) లోకి వచ్చేశా’ అంటూ ఈ రోజు ఉదయం ట్విట్టర్ అకౌంట్ క్రియోట్ చేసి అందరికి హాయ్ చెప్పాడు. దీంతో అప్పటి నుంచి ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
” హయ్ .. నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్. ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. నేను నా భావాలను స్టేజ్ పైనా ప్రకటిస్తుంటే కొద్ది మంది ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు నుండి ఈ ట్విట్టర్ అనే వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్చ ని తెలియపరుస్తాను.. థాంక్యూ’ అంటూ మొదటి పోస్ట్ లో రాసుకొచ్చాడు పృథ్వీ రాజ్. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. సార్ ఇప్పుడు ఇది అవసరమంటారా? అని కొందరంటుంటే..’ తగ్గేదెలా ఇక మీరు రెచ్చిపోండి’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా తన ట్విట్టర్ ఫ్రొఫైల్ కు తన ఫొటోనే పెట్టిన పృథ్వీ.. కవర్ ఫొటోకు మాత్రం మెగా ఫ్యామిలీ ఫొటో ఎంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు కలిసున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతా కవర్ ఫొటోగా పెట్టుకున్నాడు.
Hi nenu mee 30 yrs industry Prudhviraj I’m officially into Twitter
నేను నా భావాలను స్టేజ్ పైనా ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నాను కాబట్టి ఈరోజు నుండి ఈ X ఆనే
వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్చ ని తెలియపరుస్తాను.
Thankyou pic.twitter.com/jB0zdNUjpi— prudhvi actor (@ursprudhviraj06) February 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి