Prudhvi Raj: ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స.. కారణమేంటంటే?

|

May 10, 2023 | 12:15 AM

ప్రముఖ కమెడియన్‌, నటుడు పృథ్వీరాజ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న ఆయన సడెన్‌గా ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు సెలైన్‌ కూడా పెట్టారు. అయితే పృథ్వీరాజ్‌ ఆస్పత్రిలో ఎందుకు చేరారో ఇంకా తెలియరాలేదు. ఆస్పత్రి బెడ్‌పై పృథ్వీని చూడగానే అభిమానులు తెగ కంగారు పడ్డారు.

Prudhvi Raj: ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స.. కారణమేంటంటే?
Prudhvi Raj
Follow us on

ప్రముఖ కమెడియన్‌, నటుడు పృథ్వీరాజ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న ఆయన సడెన్‌గా ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు సెలైన్‌ కూడా పెట్టారు. అయితే పృథ్వీరాజ్‌ ఆస్పత్రిలో ఎందుకు చేరారో ఇంకా తెలియరాలేదు. ఆస్పత్రి బెడ్‌పై పృథ్వీని చూడగానే అభిమానులు తెగ కంగారు పడ్డారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆస్పత్రి బెడ్‌పై నుంచే ఒక వీడియోను రిలీజ్‌ చేశారు పృథ్వీ. ‘డైరెక్టర్‌ గా తొలిసారి సినిమా తీయబోతున్నాను. ‘కొత్త రంగుల ప్రపంచం’ మూవీకి మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈనెల 26న ఇంకా పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. సెలైన్‌తో ఉన్నా సినిమా గురించే ఆలోచిస్తున్నాను. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకి, మా టీమ్ కి మీ అందరి సపోర్ట్ ఉండాలి’ అని వీడియోలో చెప్పుకొచ్చారు పృథ్వీ. అయితే తన అనారోగ్యానికి కారణమేంటో క్లారిటీ ఇవ్వలేకపోరాయన. అయితే తీవ్ర అలసట వల్లే పృథ్వీ ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది.

కమెడియన్ గా, నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పృథ్వీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఖడ్గం సినిమాలోని 30 ఇంయర్స్ ఇండస్ట్రీ అనే ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాల్లో ఉంటూనే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వైసీపీ పార్టీలో చేరి ఎస్వీబీసీ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. అయితే కొన్ని కారణాలతో వైసీపీని వీడి ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..