
కొన్నాళ్లుగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. భారీ బడ్జెట్తో నిర్మించిన టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూన్ 16న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ అంచనాలను తారస్థాయికి చేర్చాయి. ఇక మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు దాదాపు లక్షకు పైగా అభిమానులు విచ్చేశారు.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. ఇప్పటివరకు సినీ పరిశ్రమలోనే ఏ సినిమాకు జరగనంత గ్రాండ్ గా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిందని. ఈ వేడుకలో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కరమయ్యాయి. ముఖ్యంగా ఈ వేడుకలో ప్రభాస్ రాక.. శివధనుస్సుని ఎత్తడం. వేదికపై శివధనుస్సుని ఎత్తే సీన్ ను రీక్రియేట్ చేయించారు. ప్రభాస్ స్టేజి మీదకు రాగానే అక్కడ టేబుల్ పై శివధనుస్సును ఉంచారు. ఇక ఆ శివధనుస్సని పైకి పెట్టి ఎక్కుపెట్టారు ప్రభాస్. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్, ప్రేక్షకులు అరుపులు, విజిల్స్ వేయడంతో.. సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. అదే సమయంలో సభా ప్రాంగణంలో క్రాకర్స్ కాల్చారు. ప్రభాస్ శివ ధనుస్సును పైకి ఎక్కుపెట్టిన సమయంలో స్క్రీన్ పై ప్రభాస్ కనిపించగా.. బ్యాక్ టూ బ్యాక్ ముగ్గురు ప్రభాస్ ఒకే స్క్రీన్ పై కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఖుషి అవుతున్నారు అభిమానులు.
రామయాణం ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ ఓంరౌత్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. అయితే మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైఫ్ గైర్హాజరయ్యారు. ఇక ఈ వేడుక అనంతరం హీరోయిన్ కృతి సనన్, డైరెక్టర్ ఓంరౌత్ తో పాటు చిత్రయూనిట్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.