షూటింగ్ ఆపేసి స్ట్రైక్ చేశా.. ఆ హీరో నాకోసం మటన్ తెప్పించారు: విలన్ పొన్నంబళం
ప్రముఖ విలన్, స్టంట్ మాస్టర్ పొన్నాంబళం గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చేసిన సాయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కాపాడటం వల్లే తాను ఈరోజు ఇలా ఉన్నాయని తెలిపాడు. ఐదు భాషల్లో 1500 సినిమాలకు పైగా స్టంట్ మాస్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, విలన్‌గా పని చేసిన పొన్నాంబళం..

ప్రముఖ నటుడు పొన్నంబళం గుర్తున్నాడా.? ఒకప్పుడు విలన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను భయపెట్టాడు ఈ నటుడు. తెలుగు, తమిళ్ సినిమాల్లో విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు పొన్నంబళం. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడిన ఆయన ఇటీవలే కోలుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పొన్నంబళం మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ జీవితంలోని కీలక మలుపులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు పొన్నంబళం. అలాగే ఘరానా మొగుడు సినిమా షూటింగ్‌లో చోటుచేసుకున్న ఒక అనూహ్య సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు.
1987-88 ప్రాంతంలో పొన్నంబళం తన జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కుటుంబ పోషణ భారం, నలుగురు సోదరీమణులు, మొత్తం 11 మంది సభ్యుల కుటుంబ బాధ్యత తనపై ఉండడంతో డబ్బు అవసరం తీవ్రంగా ఉండేదని తెలిపారు. సినిమా రంగంలోకి వచ్చినప్పటికీ, గ్రూప్ ఫైట్‌లలో చేస్తూ ఉన్నా తగిన గుర్తింపు, ఆదాయం రావడం లేదని ఆయన అన్నారు. ఆతర్వాత గ్రూప్ ఫైట్‌లను పూర్తిగా మానేసి, కేవలం సోలో ఫైట్‌లు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నా.. అప్పటి యూనియన్ నిబంధనల ప్రకారం సోలో ఫైట్‌కు రూ. 3,000 మాత్రమే లభించేది. అయితే, పొన్నంబళం రూ. 25,000 డిమాండ్ చేసి అందరినీ షాక్ కు గురయ్యేలా చేశారట. ఈ డిమాండ్‌ను చాలా మంది పొగరుగా భావించినా, చిరంజీవి గారు మాత్రం పొన్నంబళం నైపుణ్యాన్ని గుర్తించారని ఆయన అన్నారు.
“అది పొగరు కాదు. వారికి నైపుణ్యం లేకపోతే అలా అడగరు. పిలువు, నేను ఇస్తాను” అని చెప్పి పొన్నంబళానికి సపోర్ట్ చేశారట. చిరంజీవి మద్దతుతో పొన్నంబళం ఘరానా మొగుడు సినిమాలో ఒక ముఖ్యమైన ఫైట్ సీన్‌లో నటించే అవకాశం పొందారు. ఈ ఫైట్ చిత్రీకరణ జరుగుతుండగా ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఒక రోజు భారీగా ఫైట్ చేసిన తర్వాత పొన్నంబళంకు భోజనంలో మటన్ అందలేదట. హెవీ ఫైట్ చేసినందున శక్తి కోసం మటన్ అవసరమని, మూడ్ లేదని షూటింగ్‌కు నిరాకరించారట. మేనేజర్ మోహన్ (అప్పటి చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్) సర్దుకుపోవాలని కోరినా, పొన్నంబళం ఒప్పుకోలేదట. అప్పుడు టైం మధ్యాహ్నం 2:30 గంటలు దాటి, హీరో చిరంజీవి సెట్‌కు చేరుకున్నారు. పొన్నంబళం షూటింగ్‌కు రాకపోవడంతో స్ట్రైక్ చేశాడని తెలిసి ఆశ్చర్యపోయారట చిరు. తర్వాత చిరంజీవి స్వయంగా వచ్చి పొన్నంబళంతో మాట్లాడారట. ఏంటి పొన్నంబళం, గొడవ చేస్తున్నావా?” అని అడగ్గా, సార్, గొడవ ఏం లేదు. నాకు భోజనం కావాలి. మటన్ అడిగాను, అది నాకు చాలా ఇష్టం అని పొన్నంబళం చెప్పారట. చిరంజీవి గారు, నేను కూడా మటనే తింటాను. హైదరాబాద్‌లో మటన్ దొరకలేదా?” అని ప్రొడక్షన్‌ను ప్రశ్నించారట చిరంజీవి. వెంటనే మటన్ తెప్పించి, పొన్నంబళంకు భోజనం పెట్టారట. 500 నుండి 1000 మంది ఉన్న గ్యాలరీ ఫైట్ అది, తాను లేకపోతే షూటింగ్ ఆగిపోతుందని పొన్నంబళం చెప్పడం, దాన్ని చిరంజీవి గారు అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించడం ఆయన గొప్ప మనస్తత్వాన్ని తెలియజేస్తుందని పొన్నంబళం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
