Nikhil Siddharth : ‘జీవితంలో ఫస్ట్ టైం ఏడ్చా’.. హీరో నిఖిల్ ఎమోషనల్ కామెంట్స్

|

Aug 01, 2022 | 7:14 PM

నిఖిల్ సిద్దార్థ్‌(Nikhil Siddharth ) యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో మాత్రమే కాదు.. సామాజిక అంశాలపై స్పందించే ఫై రియల్‌ హీరో. అనుకున్నది అనుకున్నట్టు.. ట్విట్టర్ వేదికగా చెప్పేసే హీరో..! ఎవరు ఏమనుకుంటారనేది అసలేమాత్రం పట్టించుకోని హీరో!

Nikhil Siddharth : జీవితంలో ఫస్ట్ టైం ఏడ్చా.. హీరో నిఖిల్ ఎమోషనల్ కామెంట్స్
Nikhil
Follow us on

నిఖిల్ సిద్దార్థ్‌(Nikhil Siddharth ) యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో మాత్రమే కాదు.. సామాజిక అంశాలపై స్పందించే ఫై రియల్‌ హీరో. అనుకున్నది అనుకున్నట్టు.. ట్విట్టర్ వేదికగా చెప్పేసే హీరో..! ఎవరు ఏమనుకుంటారనేది అసలేమాత్రం పట్టించుకోని హీరో! అలాంటి ఈ హీరో తాజాగా ట్విట్టర్ వేదికగా మరో సారి ఎమోషనల్ అయ్యారు. ఆ ఎమోషన్లో కూడా ఫైర్ ఏమాత్రం మిస్‌ అవ్వకుండా అందర్నీ షాక్ చేశారు. థియేటర్స్ సిండికేట్‌ పై స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.

ఇక తన కెరీర్లోనే సూపర్ డూపర్ హిట్టయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ రెడీ చేశారు నిఖిల్. కార్తికేయ 2ను పాన్ ఇండియా రేంజ్ లో జూలై 22న రిలీజ్‌ చేద్దామనుకున్నారు. కాని థియేటర్లు ఖాళీ లేవని చెప్పడంతో.. ఆగస్టు 12కి మార్చుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంట్రవ్యూలో నిఖిల్ మాట్లాడుతూ..  ఆగస్టు 12కు కూడా థియేటర్స్‌ ఖాళీ లేవని అక్టోబర్‌కు మీ రిలీజ్ మార్చుకోండని కొంత మంది పెద్దమనుషులు చెప్పడంతో.. తీవ్ర బాధకు లోనయ్యారు నిఖిల్. అంతేకాదు.. వారు అలా అన్నప్పుడే జీవితంలో ఫస్ట్ టైం ఏడ్చాఅన్నారు. నాలా బ్యాక్‌ రౌండ్‌ లేని వారు తమ మూవీ రిలీజ్‌ చేసుకోవడం కష్టం అంటూ.. కామెంట్స్ చేశారు నిఖిల్. ఇక ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీటిలో చందు మొండేటి తెరకెక్కిస్తోన్న కార్తికేయ 2 ఒకటి కాగా రెండోది సుకుమార్ రైటింగ్స్ పై వస్తున్న 18 పేజెస్ సినిమా ఒకటి ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి