Tollywood: స్కూల్లో కొడుకుకు సాయం చేస్తున్న టాలీవుడ్ స్టార్.. క్యూట్ ఫోటో షేర్ చేసిన క్రేజీ హీరో..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో.. తాజాగా తన కొడుకుకు స్కూల్లో హెల్ప్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగులో మంచి పాపులారిటీ ఉన్న ఆ నటుడు ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Tollywood: స్కూల్లో కొడుకుకు సాయం చేస్తున్న టాలీవుడ్ స్టార్.. క్యూట్ ఫోటో షేర్ చేసిన క్రేజీ హీరో..
Nani

Updated on: Nov 03, 2025 | 10:24 AM

పైన ఫోటోను చూశారా.. ? స్కూల్లో తన కొడుకుకు సాయం చేస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా వరుస హిట్స్ అందుకున్నాడు. అతడు మరెవరో కాదండి హీరో న్యాచురల్ స్టార్ నాని. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరో. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నాని.. ఇప్పుడు తన తనయుడి స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం సహయం చేస్తూ కనిపించాడు.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?

స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ ఈవెంట్ లో తన కొడుకుకు సహయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం నాని షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ‘ది ప్యారడైజ్ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించేలా రూపొందుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో వస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

ఈసినిమా తర్వాత నాని డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలోసినిమా చేయనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతోసినిమా ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..