ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో. యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ, ఎప్పటికీ పక్కింటి అబ్బాయిగా గుర్తుండిపోతారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. హీరోగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆ కుర్రాడు.. వైవిధ్యమైన సినిమాలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ స్టార్ హీరో.. తన కెరీర్ లో ఎదురైన సవాళ్లు.. తన మొదటి ఉద్యోగం, సంపాదన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.. ? అతడే ఘంటా నవీన్ బాబు…. అదేనండీ.. న్యాచురల్ స్టార్ నాని. ఈ అబ్బాయి గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా ఇష్టమైన నటుడు. సహజమైన నటనతో వెండితెరపై సినీ ప్రియులను మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి అనుహ్యాంగా హీరోగా మారాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
“నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు నా మొదటి జీతం రూ.4000. ఫస్ట్ సాలరీ అందుకున్న క్షణం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేను. ఫస్ట్ సాలరీగా తీసుకున్న డబ్బంతా రూ. వంద నోట్లే. షూటింగ్ పనులు ముగించుకుని వాటిని నా జేబులో పెట్టుకుని బైక్ మీద తిరిగి రూంకు వెళ్తున్నాను.. ఆ సమయంలో నా దగ్గురున్న డబ్బుతో సగం హైదరాబాద్ సగం కొనాలనుకున్నాను. ఆ భావన అంత గొప్పగా అనిపించింది. ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నప్పటికీ నా మొదటి జీతం అందుకున్నప్పుడు పొందిన ఆనందాన్ని పొందలేకపోతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వీకెండ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూసేవాడినని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
అష్టా చెమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నాని.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకున్నారు. జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో.. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇందులో మరోసారి నాన్న పాత్రలో సినీ ప్రియులను అలరించారు. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.