Singer Smitha: సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. సందడి చేసిన హీరో నాని.. బ్యూటిఫుల్ వీడియో

గాయనిగా, నటిగా, డ్యాన్సర్‌గా, సామాజిక సేవకురాలిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్మిత. ముఖ్యంగా తన పాప్ సాంగ్స్ తో యువతను ఉర్రూతలూగించిందామె. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించని స్మిత ఫ్యామిలీకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తోంది.

Singer Smitha: సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. సందడి చేసిన హీరో నాని.. బ్యూటిఫుల్ వీడియో
Singer Smitha, Nani

Updated on: Apr 20, 2024 | 4:37 PM

గాయనిగా, నటిగా, డ్యాన్సర్‌గా, సామాజిక సేవకురాలిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్మిత. ముఖ్యంగా తన పాప్ సాంగ్స్ తో యువతను ఉర్రూతలూగించిందామె. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించని స్మిత ఫ్యామిలీకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తూ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా స్మిత ఇంట్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి న్యాచురల్ స్టార్ హీరో నాని త‌న కుటుంబ సభ్యులతో కలిసి హాజరవ్వడం విశేషం. ఈ సందర్భంగా స్వామివారికి తలంబ్రాలు పోసి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు నాని దంపతులు. ఇందుకు సంబంధించిన వీడియోను స్మిత అమ్మగారు జోగు ప్రసాద్ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. దీనికి  శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

కాగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా నాని సతీమణి అంజనా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఇవి కూడా చదవండి

స్మిత ఇంట్లో శ్రీరామ నవమి వేడుకలు.. వీడియో ఇదిగో..

 

‘మొదటిసారి థియేటర్ లో జెర్సీ సినిమా చూసిన రోజులు నాకింగా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా సినిమాలోని సీన్స్ నన్ను భావోద్వేగానికి గురి చేస్తాయి. మా అబ్బాయి అర్జున్ ఇప్పుడిప్పుడే జెర్సీ థీమ్ సాంగ్ పై పియానో వాయించడం నేర్చుకుంటున్నాడు’ అని రాసుకొచ్చింది అంజనా. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’  సినిమాలో నటిస్తున్నాడు. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.