Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నాగశౌర్య.. ఆ కీలకపాత్రలో కనిపించనున్న యంగ్ హీరో..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నాగశౌర్య.. ఆ కీలకపాత్రలో కనిపించనున్న యంగ్ హీరో..
Naga Shaurya

Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 7:00 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేర్ వీర్రాజు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల్లో భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చెల్లెల్లి సెంటిమెంట్ ప్రధానంగా ఈ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో మరో యంగ్ హీరో నాగశౌర్య కూడా నటించనున్నాడట. అది కూడా కీర్తి సురేష్ భర్త పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే చిత్రయూనిట్ నాగశౌర్యను సంప్రదించినట్టుగా టాక్. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో సాగే మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్.. మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది.

Also Read: RRR Movie Pre Release Event Live: అంగరంగ వైభవంగా ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. లైవ్‏లో చూసేయ్యండి..

RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్‌..

RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్ సీన్‌.. 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో..

చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు