Naga Chaitanya: ‘గర్ల్‏ఫ్రెండ్‏తో కారులో రొమాన్స్.. పోలీసులకు దొరికా’.. చై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Aug 15, 2022 | 3:15 PM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు. చైతూ జీవితంలో సమంత కంటే ముందు మరో అమ్మాయిని ఇష్టపడినట్లు తెలిపారు.

Naga Chaitanya: గర్ల్‏ఫ్రెండ్‏తో కారులో రొమాన్స్.. పోలీసులకు దొరికా.. చై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Naga Chaitanya
Follow us on

లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ మూవీలో సౌత్ అబ్బాయి బాలరాజు పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆగస్ట్ 11న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు చైతూ. కాలేజీ లైఫ్.. ప్రేమ, పెళ్లి, విడాకులు.. వృత్తిపరమైన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు. చైతూ జీవితంలో సమంత కంటే ముందు మరో అమ్మాయిని ఇష్టపడినట్లు తెలిపారు.

హైదరాబాద్‏లోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో కారు వెనక సీట్లో తన గర్ల్ ఫ్రెండ్‏ను కిస్ చేస్తుండగా.. పోలీసులకు దొరికిపోయానని.. ఆ సమయంలో అదేమి తనకు తప్పు అనిపించలేదని చెప్పుకొచ్చారు. నేను ఏం చేస్తున్నానే విషయం నాకు తెలుసు. అంతా బాగానే ఉంది. కానీ పోలీసులకు దొరికిపోయాను అని అన్నారు. అయితే తన గర్ల్ ఫ్రెండ్ పేరు మాత్రం రివీల్ చేయలేదు. గతంలో చైతూ ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయ్యేవాడు కాదని.. ప్రస్తుతం అన్ని విషయాలను ఫ్యామిలీ, స్నేహితులతో షేర్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఇక ఇదిలా ఉంటే.. లాల్ సింగ్ చద్దా తర్వాత హిందీలో ఆఫర్స్ వస్తే చేస్తానని గతంలోనే తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.naga chaitanya, naga chaitanya movies, naga chaitanya latest, naga chaitanya upcoming, naga chaitanya films, naga chaitanya news, laal singh chaddha