
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో మెరిశారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లోనే కుబేర సినిమా రూ 80 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కుబేర గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్ర బృందం కూడా హ్యాపీగా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ లో కుబేర సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. కుబేర సినిమాలో బిక్షగాడి పాత్రలో ధనుష్ అద్భతంగా నటించాడు. ఇందుకు గానూ అతనికి జాతీయ అవార్డు రావడం పక్కా అని మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులు కితాబిస్తున్నారు. అదే సమయంలో ధనుష్ మెయిన్ హీరో అయినా సినిమా కథ మొత్తం నాగార్జున చుట్టే తిరుగుతుంది. ఇందులో ఆయన సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో కనిపించారు.
ఫస్ట్ హాఫ్ లో కాస్త నెగెటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించిన నాగార్జున సెకండ్ హాఫ్ లో మాత్రం ధనుష్ ను కాపాడే వ్యక్తిగా అద్భుతంగా నటించాడు. అందుకే కుబేర సినిమాలో నాగార్జున నటన గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కేవలం ఆడియెన్స్ మాత్రమే కాదు, సినీ విమర్శకుల నుంచి కూడా నాగ్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే నాగార్జున పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నాగార్జున పాత్రను మొదట వేరే నటుడితో చేయాలని అనుకున్నారట శేఖర్ కమ్ముల. ఇందుకోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను మొదట సంప్రదించారట. ఆయనకు కథ కూడా చెప్పారట. అయితే ఎందుకో గానీ మోహన్ లాల్ పెద్దగా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో శేఖర్ వెంటనే నాగార్జున దగ్గరికి వెళ్లి కథ చెప్పారట. కథ బాగుందని చెప్పడంతో వెంటనే కుబేర సినిమా పట్టాలెక్కిందట. ఇక ఆ తర్వాతి విషయం తెలిసిందే కదా.. సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.
After a long time, everything’s aligned perfectly 🤩
Team delivered ✅
Media appreciated✅
Audience loved it ❤️Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/Y2hpDHRxQx
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.