Marakkar Movie: తెలుగులో విడుదల కానున్న మోహన్ లాల్ సినిమా.. మరక్కార్ రిలీజ్ ఎప్పుడంటే..

Mohan Lal Marakkar Movie: మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ సినిమా మరక్కార్. మళయాలంలో తెరకెక్కిన

Marakkar Movie: తెలుగులో విడుదల కానున్న మోహన్ లాల్ సినిమా.. మరక్కార్ రిలీజ్ ఎప్పుడంటే..

Updated on: Nov 22, 2021 | 9:45 AM

Mohan Lal Marakkar Movie: మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ సినిమా మరక్కార్. మళయాలంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు అరేబియా సముద్ర సింహ అనేది ఉప శీర్షిక. అంటే.. మరక్కార్.. ది అరబికడలింటే సింహం డిసెంబర్ 2న తెలుగులో విడుదల కానుంది. ప్రియదర్శన తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ మళయాంలో భారీ ఎత్తున నిర్మించారు.

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ సినిమాను కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరక్కార్ తెలుగు హక్కులను టాలీవుడ్ నెంబర్ వన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ దక్కించుకుంది. తెలుగులో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. ఆయన కీలక పాత్రలలో నటించిన జనతా గ్యారెజ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇక మరక్కార్ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రయదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. రొన్నీ రాఫెల్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కనులను కలిపినా అంటూ వచ్చిన మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది.

Also Read: Jai Bhim: జైభీమ్ సినిమా వివాదంపై స్పందించిన డైరెక్టర్.. కావాలని సూర్యను టార్గెట్ చేస్తున్నారంటూ..