రాజమౌళి నయా స్కెచ్.. రంగంలోకి సమంత..! మరోసారి హిట్ కపుల్‌తో జక్కన్న.. (వీడియో)
'బాహుబలి' సినిమాతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి సొంతం. టాలీవుడ్‌లో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం RRR అనే మరో గొప్ప సినిమాను ఆవిష్కరిస్తున్నారు.
‘బాహుబలి’ సినిమాతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి సొంతం. టాలీవుడ్‌లో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం RRR అనే మరో గొప్ప సినిమాను ఆవిష్కరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్టు విషయమై మహేష్ బాబు కోసం రాజమౌళి ఓ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
RRR రిలీజ్ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాను కూడా భారీ రేంజ్‌లో రూపొందించాలని జక్కన్న ఫిక్సయ్యారట. మహేష్ కెరీర్ లోనే మరచిపోలేని సినిమాగా ఉండాలని భావిస్తున్న రాజమౌళి.. ఇందుకోసం సమంతను రంగంలోకి దించుతున్నారని సమాచారం. ఇటీవలే నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా బయటపెట్టిన సమంత.. ప్రస్తుతం కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటున్న సామ్‌తో ఇటీవల రాజమౌళి సంప్రదింపులు జరిపి మహేష్ బాబుతో సినిమా గురించి చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయరు . ఇప్పటిదాకా ఒక్క అనుష్కను మాత్రమే రిపీట్ చేయగా. ఇప్పుడు ఈ లిస్టులోకి సమంత కూడా రాబోతుందని తెలుస్తుండటం విశేషం. గతంలో రాజమౌళి రూపొందించిన ‘ఈగ’ సినిమాలో నటించిన సమంత.. మళ్ళీ ఇప్పుడు మహేష్ మూవీ కోసం జక్కన్న సెట్స్ పైకి రాబోతున్నారట. ఇది ఎంతవరకూ నిజమనేది అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

