Mohan Babu: సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట..

|

Jan 09, 2025 | 1:34 PM

సీనియర్ హీరో మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Mohan Babu: సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట..
Mohan Babu
Follow us on

టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం టీవీ 9 జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ఈ కేసులో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా న్యాయస్థానం ఇరువురి తరపు న్యాయవాదులను పలు ప్రశ్నలు అడిగింది. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా ? అని మోహన్ బాబు తరపు న్యాయవాదులను ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

మోహన్ బాబు తరపు న్యాయవాది వాదనలు..

తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగింది. జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పాము. అది కేవలం ఆవేశంలో జరిగింది. బాధితుడికి నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను. 76 ఏళ్ల వయసున్న మోహన్ బాబు కావాలని దాడి చేయలేదని.. అది ఆవేశంలో జరిగిందిని.. జర్నలిస్టులు గుంపుగా తన ఇంట్లోకి ట్రెస్ పాస్ చేశారని సినీ నటుడు మోహన్ బాబు తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు.

జర్నలిస్ట్ రంజిత్ తరఫున వాదనలు..

రంజిత్‌పై మోహన్ బాబు దాడి చేశారు. అతడి దవడ ఎముక విరికి సర్జరీ చేయాల్సి వచ్చింది. రంజిత్ 5 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నారు. నెల రోజులుగా పైపు ద్వారానే ఆహారం తీసుకుంటున్నారు. దాడి చేయడమే కాకుండా కించపరిచేలా స్టేట్మెంట్ ఇచ్చారు. రంజిత్‌కు ప్రొఫెషనల్ గా నష్టం జరిగింది. అతడు తన కెరీర్ ను నష్టపోయారని జర్నలిస్టు తరపు న్యాయవాది తెలిపారు.

సుప్రీంకోర్టు విచారణ..

ఈ కేసులో నష్టపరిహారం కావాలా ? లేదా మోహన్ బాబును జైలుకు పంపాలా ? అని జర్నలిస్టు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని.. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.