AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాలో ముందు నన్నే అనుకున్నారు.. కానీ ఆతర్వాత పక్కన పెట్టేశారు.. అసలు విషయం చెప్పిన ఎల్.బి. శ్రీరామ్

తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘకాలం నటుడిగా, రచయితగా సేవలందించిన ఎల్.బి. శ్రీరామ్, తన కెరీర్‌లో ఎదుర్కొన్న విచిత్రమైన సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన 500కు పైగా చిత్రాలలో నటించి, ఐదు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గెలుచుకున్నారు ఎల్.బి. శ్రీరామ్ .

ఆ సినిమాలో ముందు నన్నే అనుకున్నారు.. కానీ ఆతర్వాత పక్కన పెట్టేశారు.. అసలు విషయం చెప్పిన ఎల్.బి. శ్రీరామ్
Lb Sriram
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2026 | 2:11 PM

Share

ప్రముఖ నటుడు ఎల్.బి. శ్రీరామ్ మిధునం సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్వర్గీయ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పోషించిన ముఖ్య పాత్ర కోసం మొదట తననే సంప్రదించారని ఆయన తెలిపారు. ఎల్.బి. శ్రీరామ్ మాట్లాడుతూ.. అది చాలా పెద్ద కథ అని, దానికి ఒక వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 కూడా అవసరమని చమత్కరించారు. మిధునం సినిమా కోసం తన మీద చాలా వర్క్ చేశారని, గెటప్‌లు కూడా అనుకున్నారని ఎల్.బి. శ్రీరామ్ తెలిపారు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా తనకు అందిందని పేర్కొన్నారు. అయితే, ప్రొడ్యూసర్‌కు ఎల్.బి. శ్రీరామ్ మార్కెట్ పై కొన్ని సందేహాలు ఉండేవని.. అలాగే కేవలం రెండు పాత్రలు ఉన్న ఈ సినిమాకు, తనను ప్రధాన నటుడిగా తీసుకోవడంపై ప్రొడ్యూసర్‌కు సందేహం వ్యక్తమైనట్లు శ్రీరామ్ వివరించారు.

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

అంతేకాకుండా, సినిమా చిత్రీకరణ సమయం విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వేసవి కాలంలో కాకుండా, అక్టోబర్-నవంబర్ వంటి చలికాలంలో చిత్రీకరణ జరపాలని ప్రొడ్యూసర్‌ సూచించారు. చలికాలంలో పచ్చదనం ఎక్కువగా ఉంటుందని, విశాలమైన ఇల్లు, తోటతో కూడిన తమ చిత్రీకరణ ప్రదేశానికి ఆ వాతావరణం బాగుంటుందని ప్రొడ్యూసర్‌ అభిప్రాయపడినట్లు శ్రీరామ్ చెప్పారు. అయితే, శ్రీరామ్ ఈ ప్రతిపాదనను ఒప్పుకోలేదట. ఇది చిన్న సినిమా అని, రోజులు గడిచే కొద్దీ ఆలోచనలు మారిపోతాయని, కాబట్టి వెంటనే చిత్రీకరణ ప్రారంభించాలని తాను ప్రొడ్యూసర్‌కు చాలాసార్లు చెప్పినట్లు ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి : అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్..

తాను ఎంతగా చెప్పినా ప్రొడ్యూసర్‌ ఒప్పుకోకపోవడంతో, ఆ నిర్ణయాన్ని తనికెళ్ల భరణి గారిపైకి నెట్టేశారని ఎల్.బి. శ్రీరామ్ తెలిపారు. “ఏమండీ, మీరు అడిగి చూడండి ఒప్పుకుంటే” అని ప్రొడ్యూసర్‌ తనతో అన్నారని, తాను ఒప్పుకోవట్లేదని చెప్పినప్పుడు “రెండు నిమిషాలు టైం ఇవ్వండి” అని చెప్పి, టాయిలెట్‌కు వెళ్లి వస్తానని బయటికి వెళ్లానని శ్రీరామ్ సరదాగా వివరించారు. ఆ విధంగా, ప్రొడ్యూసర్‌ మార్కెట్ సందేహాలు, చిత్రీకరణ ఆలస్యం కావాలన్న వారి పట్టుదల వంటి కారణాలతో మిధునం సినిమాలో నటించే అవకాశం తనకు దక్కలేదని, ఆ పాత్రను ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పోషించారని ఎల్.బి. శ్రీరామ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ డైరెక్టర్ నన్ను వద్దు అన్నాడు.. కానీ హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన నందిని రెడ్డి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us