Kiran Abbavaram: ఆ హీరోయిన్‌తో పెళ్ళికి రెడీ అయిన కిరణ్ అబ్బవరం.. ఈ నెల 13న ఎంగేజ్మెంట్
రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్యను కిరణ్ పెళ్లాడనున్నాడు. గత ఐదేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 17న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది.

టాలీవుడ్ లో పెళ్లిబాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య వివాహం ఘనంగా జరిగింది. ఇప్పుడు మరో కుర్ర హీరో పెళ్ళికి రెడీ అయ్యాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్యను కిరణ్ పెళ్లాడనున్నాడు. గత ఐదేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఇక కిరణ్ అబ్బవరం మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు కిరణ్. తొలి సినిమా రాజావారు రాణి గారు మంచి టాక్ ను సొంతం చేసుకోగా.. ఆతర్వాత వచ్చిన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా హిట్ అయ్యింది. ఆతర్వాత ఈ యంగ్ హీరో నటించిన సినిమాల్లో కొన్ని యావరేజ్ గా నిలవగా మరికొన్ని నిరాశపరిచాయి. అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నాడు.
ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాడు ఈ యంగ్ హీరో. ఇక రహస్య పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. రాజావారు రాణిగారు సినిమా తర్వాత తమిళ్ లో ఓ సినిమాలో నటించింది ఈ అమ్మడు. రాజావారు రాణిగారు సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కాగా ఇప్పుడు ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనుండటంతో అభిమానులు సంతోష వ్యక్తం చేస్తున్నారు.
రహస్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
కిరణ్ అబ్బవరం ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.