Kaithi 2: ఢిల్లీ మళ్లీ వస్తున్నాడు.. త్వరలోనే ఖైదీ 2.. డైరెక్టర్ లోకేష్‌కి కార్తీ స్పెషల్ గిఫ్ట్
2019లో విడుదలైన ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా లోకేష్ కనగరాజ్ దర్శకత్వ ప్రతిభ దేశానికి పరిచయమైంది. ఇక కార్తీ నటన కు కూడా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది.

2019 లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖైదీ సినిమాలో హీరో పాత్ర పేరు ఢిల్లీ. ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు కార్తీ. తన అసమాన్య నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సినిమాకు కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఖైదీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. అవును లోకేష్ కనకరాజ్ తన ఎల్ సీ యూ ( లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) లో భాగంగా ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలను తీశాడు. అలాగే వీటికి కొనసాగింపుగా ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు కూడా తెరకెక్కించాల్సి ఉంది. అయితే ఇప్పుడు రజనీకాంత్ కూలీ కూడా ఎల్ సీ యూలో భాగమే అని అంటున్నారు. మరి ఈ కూలీ తరువాత లోకేష్ కార్తీతో కలిసి ఖైదీ 2 తీస్తాడని అంటున్నారు. ఈ విషయాన్ని హీరో కార్తీ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఇటీవల తన పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ సందర్భంగా హీరో కార్తీ డైరెక్టర్ కు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. సపరేట్‌గా లోకేష్‌ను పిలిచిన కార్తీ.. చేతికి కడియాన్ని తొడిగేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘త్వరలోనే ఢిల్లీ మళ్లీ తిరిగి వస్తున్నాడు. ఈ ఏడాది మీకు అద్భుతంగా గడిచిపోవాలి’ అని లోకేష్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు కార్తీ. . కార్తీ ట్వీట్‌కు లోకేష్ కూడా స్పందించాడు. డిల్లీ ఓ బ్యాంగ్‌తో వెనక్కి తీసుకు వద్దాం.. ఈ స్పెషల్ గిఫ్ట్‌కు థాంక్స్ సర్ అంటూ రిప్లై ఇచ్చాడు. విశేషమేమిటంటే ఈసారి ‘ఖైదీ2’ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కన్నడలో ‘టాక్సిక్’, ‘కెడి’, విజయ్ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’ లను నిర్మిస్తోన్న కేవీఎన్ ఇప్పుడు ఖైదీ 2 ను కూడా తెరకెక్కించనుంది. కాగా సీక్వెల్ ప్రకటన తర్వాత అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఖైదీ 2 సినిమా దిల్లీ తదుపరి కథను చూపిస్తుందా లేక అతను జైలుకు ఎందుకు వెళ్లాడు? అంతకు ముందు అతను ఏమి చేస్తున్నాడో కథను చూపిస్తుందా? అంటూ తమకు తాము ఊహించుకుంటున్నారు.
లోకేష్ బర్త్ డే వేడుకల్లో కార్తీ..
Thank you so much @Karthi_Offl sir , let’s bring back DILLI with a 💥 and thank you as well for my birthday gift , my new kada 🙏🏻 https://t.co/eLmvLC6RS5
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి