యాక్సిడెంట్‌లో ఫ్యాన్ మ‌ృతి..భోరున విలపించిన హీరో కార్తీ..

తమిళనాడులో హీరోలకి, ఫ్యాన్స్‌కి మధ్య స్పెషల్ బాండింగ్ ఉంటుంది. హీరోలను దేవుళ్లుగా భావిస్తారు తమిళ జనం. ఆ స్థాయిలోనే వాళ్లకు గౌరవ మర్యాదలు చేస్తారు. ఇక హీరోలు సైతం తమ ఫ్యాన్స్ కోసం ఎందాకైనా వెళ్తారు. వారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే వాలిపోతారు. తాజాగా అందుకు మరో ఘటన తార్కాణంగా నిలిచింది. తన అభిమాని మరణాన్ని తట్టుకోలేక తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు హీరో కార్తీ. చెన్నైకు చెందిన వ్యసాయ్ నిత్య కార్తీకి వీరాభిమాని. కార్తీ పేరుతో […]

యాక్సిడెంట్‌లో ఫ్యాన్ మ‌ృతి..భోరున విలపించిన హీరో కార్తీ..
Ram Naramaneni

|

Nov 30, 2019 | 4:21 PM

తమిళనాడులో హీరోలకి, ఫ్యాన్స్‌కి మధ్య స్పెషల్ బాండింగ్ ఉంటుంది. హీరోలను దేవుళ్లుగా భావిస్తారు తమిళ జనం. ఆ స్థాయిలోనే వాళ్లకు గౌరవ మర్యాదలు చేస్తారు. ఇక హీరోలు సైతం తమ ఫ్యాన్స్ కోసం ఎందాకైనా వెళ్తారు. వారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే వాలిపోతారు. తాజాగా అందుకు మరో ఘటన తార్కాణంగా నిలిచింది. తన అభిమాని మరణాన్ని తట్టుకోలేక తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు హీరో కార్తీ. చెన్నైకు చెందిన వ్యసాయ్ నిత్య కార్తీకి వీరాభిమాని. కార్తీ పేరుతో అతడు పలు రకాల సామాజిక కార్యక్రమాలు సైతం చేస్తుంటాడు. అయితే అతడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలకు గురైన అతడ్ని ఆస్పత్రిలో బ్రతికించడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం వ్యసాయ్ నిత్య తుది శ్వాస విడిచాడు.

ఈ విషయం తెలిసిన వెంటనే కార్తీ కుప్పకూలిపోయారు. వెంటనే వ్యసాయ్ సొంతూరు ఉళుండూరుపేటకు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి పెద్దకొడుకులా తాను ఉంటానని హామీ ఇచ్చారు. ఆ సమయంలో అభిమాని మృతదేహాన్ని చూసి కార్తీ తనని తాను కంట్రోల్ చేసుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఆ తర్వాత జరిగిన  ‘తంబి’  ఆడియో లాంచ్‌‌లో సైతం కార్తీ ముభావంగా కనిపించారు. స్టేజ్‌పై మాట్లాడుతూ అభిమాని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu