టాలీవుడ్‌లో ఊహించని విషాదం…నటుడు ఆకస్మిక మరణం

టాలీవుడ్ నటుడు జాన్ కొట్టోలీ ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ‘మను’, ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రాలతో ఆయన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘మిస్టర్ అమాయకుడు’, ‘కళాకారుడు’ వంటి లఘు చిత్రాల్లో నటించిన ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్, నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా వంటి వారు జాన్ కొట్టోలీ మృతి తమను […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:36 pm, Tue, 28 January 20
టాలీవుడ్‌లో ఊహించని విషాదం...నటుడు ఆకస్మిక మరణం

టాలీవుడ్ నటుడు జాన్ కొట్టోలీ ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ‘మను’, ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రాలతో ఆయన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘మిస్టర్ అమాయకుడు’, ‘కళాకారుడు’ వంటి లఘు చిత్రాల్లో నటించిన ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్, నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా వంటి వారు జాన్ కొట్టోలీ మృతి తమను షాక్‌కు గురి చేసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.