AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టేజ్‌పై గుక్కెట్టి ఏడ్చిన హీరోయిన్..ఎందుకో తెలుసా..!

ఒక వ్యక్తి..మరో పర్సన్‌పై ఎప్పటికి ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం చాలా కష్టమైన విషయం. అలాగే మనల్ని ఒక ఎమోషన్ వెంటాడుతున్నప్పుడు..పైకి మాములుగా ఉండటం కూడా అసాధ్యం. సరిగ్గా ఇటువంటి సందర్బాన్నే ఫేస్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా. ఇటీవల ఆమె జైపూర్‌లో జరగుతోన్న లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొంది. అక్కడ వాతావరణంలో మార్పుల వల్ల ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రసగిస్తుండగా..ఉన్నట్టుంది కన్నీళ్లు పెట్టుకుంది. అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో అక్కడ ఉన్న ఎవరికి అర్ధం కాలేదు. […]

స్టేజ్‌పై గుక్కెట్టి ఏడ్చిన హీరోయిన్..ఎందుకో తెలుసా..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jan 28, 2020 | 8:45 PM

Share

ఒక వ్యక్తి..మరో పర్సన్‌పై ఎప్పటికి ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం చాలా కష్టమైన విషయం. అలాగే మనల్ని ఒక ఎమోషన్ వెంటాడుతున్నప్పుడు..పైకి మాములుగా ఉండటం కూడా అసాధ్యం. సరిగ్గా ఇటువంటి సందర్బాన్నే ఫేస్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా. ఇటీవల ఆమె జైపూర్‌లో జరగుతోన్న లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొంది. అక్కడ వాతావరణంలో మార్పుల వల్ల ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రసగిస్తుండగా..ఉన్నట్టుంది కన్నీళ్లు పెట్టుకుంది. అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో అక్కడ ఉన్న ఎవరికి అర్ధం కాలేదు. ఆ తర్వాత తనే ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ మరణం దియా మీర్జాను స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టేలా చేసిందట. ఆదివారం అంతా బాగానే గడిచిందని, కానీ అకస్మాత్తుగా కోబ్ మృతి చెందాడని వచ్చిన కాల్ తనను పదే, పదే డిస్టబ్ చేసిందని ఆమె పేర్కొంది.  హెలికాప్టర్​ ప్రమాదంలో  అతడు చనిపోయాడనే వార్త వెంటాడిందని చెప్పిన దియా, కొన్ని సందర్బాల్లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైన టాస్క్ అని అభిప్రాయపడింది. బీపీ ఉండటం వలనే తనని తాను అదుపుచేసుకొలేకపోయానని తెలిపింది.