AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi Babu: తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన జగపతిబాబు.. అసలు జరిగింది ఇదీ

జగపతిబాబు నేచర్ చాలా విభిన్నం. ఆయన ఆలోచన తీరు.. ఇంకో 10, 15 సంవత్సరాలు ఫార్వార్డ్ ఉంటుంది. ఆయన ఇతరులకు హెల్ప్ చేయడంలో సంతృప్తి వెతుక్కుంటారు

Jagapathi Babu: తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన జగపతిబాబు.. అసలు జరిగింది ఇదీ
Jagapathi Babu
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 16, 2023 | 6:18 PM

Share

జగపతి బాబు.. ఫ్యాన్స్ జగ్గూ భాయ్ అని పిలుచుకుంటారు. ఒకప్పుడు హీరో.. ఇప్పుడు విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్. సినిమాలు పక్కన బెడితే ఆయన బయట చాలా ఓపెన్. ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడతారు. మాస్క్ ఉండదు. తనకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తారు. ఆయన ఆలోచన ధోరణి కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. సమాజంలోని చాలా రుగ్నతలపై ఆయన గట్టిగానే వాయిస్ వినిపిస్తారు. తన లైఫ్‌లోని ఎత్తు పల్లాల గురించి కూడా ఓపెన్‌గా చెప్పేస్తారు. ఎవరితో షాపింగ్‌ వెళ్లినా, రెస్టారెంట్స్‌కి వెళ్ళినా బిల్స్ ఆయనే కట్టేస్తారు. ఎదుటివారిని రూపాయి తియ్యనివ్వరు. సినిమాలు ప్లాపైతే ప్రొడ్యూసర్స్‌కు డబ్బు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఎవరైనా సాయం కోసం అడిగితే అస్సలు కాదనరు జగపతిబాబు.

ఆయన మనస్తత్వం గురించి చెప్పలంటే.. మీకు ఓ ఘటన గురించి  చెప్పాలి. జగపతి బాబు ఇంట్లో ఓ సారి దొంగల పడ్డారు. పోలీసులు వాళ్లను పట్టుకుని జైల్లో వేశారు. అయితే దొంగల భార్యలు జగపతిబాబుకు ఫోన్ చేశారట. పిల్లలతో తాము రోడ్డున పడ్డామని కంటతడి పెట్టుకున్నారట. దీంతో ఆ దొంగల కుటుంబాలకు డబ్బుల ఇచ్చారు జగపతి బాబు. అది కూడా ఒకసారి కాదు.. దొంగలు జైలు నుంచి రిలీజ్ అయ్యేంతవరకు వారి కుటుంబాలకు నెల నెలా డబ్బులు పంపుతూనే ఉన్నారు జగపతిబాబు. ఈ విషయాన్ని తానే ఓ ఇంటర్య్వూలో చెప్పారు జగ్గూ భాయ్.  దీంతో ఈయనేంట్రా బాబు..ఇంత మంచోడిలా ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..