Fahadh Faasil: ఆ అరుదైన వ్యాధితో బాధపడుతోన్న పుష్ప విలన్.. అసలు ధ్యాస ఉండదట..

|

May 27, 2024 | 10:11 PM

పేరుకు మలయాళ నటుడే అయినప్పటికీ తెలుగులోనూ ఫాహద్ ఫాజిల్ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు. ఇందులో ఫాహద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. పుష్ప 2లోనూ ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Fahadh Faasil: ఆ అరుదైన వ్యాధితో బాధపడుతోన్న పుష్ప విలన్.. అసలు ధ్యాస ఉండదట..
Fahadh Faasil Family
Follow us on

పేరుకు మలయాళ నటుడే అయినప్పటికీ తెలుగులోనూ ఫాహద్ ఫాజిల్ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు. ఇందులో ఫాహద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. పుష్ప 2లోనూ ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆవేశం సినిమాతో మరో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారీ నటుడు. ప్రస్తుతం మలయాళంలో స్టార్ యాక్టర్ గా వెలుగొందుతున్న ఫాహద్ ఫాజిల్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. ఇటీవల ఓ స్కూల్ ఓపెనింగ్ కు వెళ్లిన ఈ స్టార్ యాక్టర్ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. కేర‌ళ‌లోని ఒక చిల్డ్ర‌న్ రీ హాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఫాహద్ తాను ADHD వ్యాధి బారిన పడ్డానని చెప్పుకొచ్చాడు.

ADHD అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్ అని 41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పుకొచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. మరి దీనికి చికిత్స ఉంది అని అతనినే అడగ్గా.. చిన్నతనంలోనే బయట పెడితే క్యూర్ చేయచ్చని, కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయటపడిందని తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడీ స్టార్ యాక్టర్.

ఇవి కూడా చదవండి

ADHD లక్షణాలు ఇవే.

వైద్య నిపుణుల ప్రకారం ADHD తో సతమతమయ్యే వారికి ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదు. హైప‌ర్ యాక్టివ్, హైప‌ర్ ఫోక‌స్, ఇంప‌ల్సివిటీ లాంటి లక్షణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వారే క్రియేటివ్ గా ఉండాలనుకుంటారు. సైకలాజికల్ గా ఎంతో ఒత్తిడిలో ఉంటారు. తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని తెలుస్తోంది.

గతంలో చాలా మంది సెలబ్రిటీలకు..

కాగా గతంలో పలువురు సినిమా సెలబ్రిటీలు ADHD బారిన పడ్డారు. విల్ స్మిత్, ర్యాన్ గోస్లిన్, జస్టిన్ టింబర్ లేక్, జిమ్ క్యారీ, బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఎమ్మా వాట్సన్ తదితరులకు కూడా ఈ సమస్య ఉందని వారే వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నిత్యం సినిమా షూటింగులు, పర్యటనలతో బిజీగా ఉండే సినిమా తారలకు ఇలాంటి రుగ్మతల బారిన పడుతుంటారట. ఒత్తిడిని తగ్గించుకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ రుగ్మతలను అధిగమించవచ్చు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.