సూపర్ హిట్ చిత్రాలతో టాప్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. తెలుగు, తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. తుళ్లువదో ఇళమై సినిమా ద్వారా హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు ధనుష్. ఈ సినిమాకు ఆయన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించడం విశేషం. కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను, విమర్శలను ఎదుర్కొన్నారు ధనుష్. కానీ ఆ తర్వాత తనదైన నటనతో మెప్పిస్తూ విమర్శించిన వారే పొగిడేలా చేసుకున్నారు. ధనుష్ సినిమాల ఎంపిక చూసి దర్శకనిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారు. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగాడు ధనుష్.
అయితే ముందు ధనుష్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇటీవల కొన్నిరోజులుగా ఈ హీరో పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకుల నుంచి నయనతారతో వివాదం వరకు.. ప్రతి న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. అయితే ఓవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, విమర్శలు ఎదుర్కొంటున్న ధనుష్.. తన కెరీర్ కు, సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ నాతో సన్నిహితంగా ఉండేవారికి నేనెంటో తెలుసు. ఎవరికీ నేను అంత సులభంగా దగ్గర కాను.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. నాతో సుధీర్ఘ కాలం పరిచయం ఉన్నవారే నన్ను అర్థం చేసుకుంటారు ‘ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ధనుష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవలే హీరోయిన్ నయనతార హీరో ధనుష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.