Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత మంచివాడవయ్యా..! చనిపోయి ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ

అర్థ‌రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పిరావడంతో కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని ఆప్ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఎన్నో సినిమాల్లో డేనియల్ విలన్ గా నటించి మెప్పించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాలో ఆయన విలన్ గా నటించారు.

ఎంత మంచివాడవయ్యా..! చనిపోయి ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ
Daniel Balaji
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 30, 2024 | 4:27 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.. ప్రముఖ నటుడు డేనియ‌ల్ బాలాజీ (48) కన్నుమూశారు. గుండెపోటుతో  డేనియ‌ల్ బాలాజీ కనుమూశారు. ఆయన ఆకస్మిక మరణంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్థ‌రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పిరావడంతో కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని ఆప్ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఎన్నో సినిమాల్లో డేనియల్ విలన్ గా నటించి మెప్పించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాలో ఆయన విలన్ గా నటించారు. అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీశ్ సినిమాలో విలన్ గా నటించారు డేనియల్ బాలాజీ.

అయితే ఆయన చనిపోయిన ఇద్దరి జీవితంలో వెలుగులు నింపారు డేనియల్ బాలాజీ. దానాలన్నింటిలో అవయవదానం ఎంతో గొప్పది. చాలా మంది అవయవదానం చేస్తుంటారు. డేనియల్ కూడా ఆయన అవయవాలను దానం చేశారు. ఆయన తన రెండు కళ్ళను దానం చేశారు. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చెయ్యాలని నిర్ణయించుకున్నారు డేనియల్.

ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత వైద్యులు ఆయన కళ్ళను సేకరించి మరొకరిని అమర్చనున్నారు. ఇందుకు సంబందించిన పత్రాల పై కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రి వారు భద్రపరిచి మరో ఇద్దరికి చూపును ఇవ్వనున్నారు. ఇక డేనియల్ బాలాజీ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఇంత మంచి మనసు ఉన్న నటుడు ఇలా ఆకాలంగా మరణించడం నిజంగా దారుణం అంటూ అభిమానులు అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.